Abn logo
Nov 22 2020 @ 02:55AM

అక్కడ ఘాట్లు.. ఇక్కడ పాట్లు!

Kaakateeya

తెలంగాణలో చక్కని ఏర్పాట్లు..

పుణ్యానికి వచ్చిన భక్తులకు ఏపీలో చుక్కలు

కర్నూలులో మడుగు లేని నదీ తావులెన్నో..

పుష్కర ఘాట్ల నిర్వహణ ఘోరం

నీరు లేనిచోట బురద, పాములు..

చేసేది లేక అలంపూర్‌కు మన భక్తులు


అదే తుంగభద్ర! భక్తుల పుష్కర నివేదనలూ అవే! కానీ తెలంగాణకు, ఆంధ్రాకు ఎంత తేడా! తేటజలాల్లో తేలియాడే సంతోషాలూ, సందళ్ల మధ్య పొటమరించిన పుష్కరుడి శోభ అక్కడ! తెట్టుకట్టిన, పాములు పడగ విప్పిన బురద దిబ్బల్లో నదిని, నీటి మడుగును పోల్చలేని పుష్కర భక్తుల క్షోభ ఇక్కడ! తెలంగాణలోని అలంపూర్‌లో ఏర్పాటుచేసినవి నాలుగు ఘాట్లు. పుష్కరాల రెండోరోజు అక్కడ 35వేలమందికిపైగా మునక వేశారు. కర్నూలు పరిధిలో సిద్ధంచేసినవి 23 ఘాట్లు. శనివారం ఇన్ని ఘాట్లలో కలిపి 10 వేల మంది దాటలేదు! 


(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరం! పుణ్య తుంగభద్రలో స్నానాల కోసం భక్తులు పలు రాష్ట్రాల నుంచి విరివి గా వస్తుంటారు. రాబోయే భక్తులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు వసతులు, భద్రత కల్పిస్తుంటాయి. కానీ, పుష్కరాలు జరపడమే ఎక్కువ అన్నట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అదే సమయంలో పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం కొవిడ్‌ జాగ్రత్తలను పాటిస్తూనే.. భక్తుల మనోభావాలను పరిరక్షిస్తోంది. నదీ స్నానాలకు భక్తులకు అవకాశం కల్పిస్తోంది. ఘాట్లలో షవర్లు ఏర్పాటుచేసినా స్నానాల ప్రస్తావనను భక్తుల ఇష్టానికే విడిచిపెట్టింది. దీనికి భిన్నంగా నదీ స్నానాలను జగన్‌ ప్రభుత్వం పూర్తిగా అధికారుల్లో చేతుల్లో పెట్టేసిం ది. స్నానాలు చేయడానికి వీల్లేదంటూ ఘాట్ల వద్ద భక్తులను బలవంతంగా షవర్ల కింద నిలబెడుతోంది. ఆ మాత్రం షవర్‌ నీళ్లు ఇళ్లలో లేవా.. అనుకుంటూ జిల్లా వాసులు పుష్కర ఘాట్ల వంక తొంగి చూడటం తగ్గించేశారు. ఫలితంగా తెలంగాణలోని అలంపూర్‌ వైపు ఆం ధ్రా భక్తులు వెళ్లిపోతున్నారు. తెలంగాణలోని వేణిసోంపురం వద్ద ప్రవేశించే తుంగభద్రమ్మ గున్నిమల్ల గ్రామం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ మధ్యలోని అలంపూర్‌ నియోజకవర్గంలో జోగులాంబ, పులూరు, రాజోలి, వేణిసోంపురం పుష్కర ఘాట్లలో సౌకర్యాలు కల్పిస్తున్నారు.


కొవిడ్‌ పరీక్షల నెగెటివ్‌ రిపోర్టును చూపించి స్నానాలకు వెళ్లొచ్చని తెలంగాణ ప్రభుత్వం  ప్రకటించింది. ఘాట్లకు కేవలం పది అడుగుల దూరంలోనే పిండ ప్రదాన కేం ద్రాలు అందుబాటులో ఉంచడంతో భక్తులు పూజాధికా లు చేసుకోగలుగుతున్నారు.  కాగా, శనివారం ఏ క్షణా న వెళ్లి చూసినా కర్నూలులోని పు ష్కరఘాట్లలో నిండా వంద మంది కూడా కనిపించడంలేదు. పిండ ప్రదానాలు జరిగే ప్రాంతాన్ని సూచించే బో ర్డులు లేవు. టౌన్‌ పరిధిలోని పంచలింగాల, షిరిడి సా యి దేవాలయ ఘాట్‌ వద్ద తప్ప పిండ ప్రదాన కేంద్రా లు ఘాట్లకు దూరంగా ఉన్నాయి. పైగా ఈ-టిక్కెట్టుతో వచ్చిన వారికే పిండ ప్రదానాలకు అవకాశాలు కల్పిస్తున్నారు. మరుగుదొడ్ల కోసం వెతకలేక ఘాట్ల వద్దే మూత్ర విసర్జన చేయడం కనిపించింది. కాగా, కర్నూలు పుష్కర ఘా ట్లలో నీళ్లు లేకపోవడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకు డు హరీశ్‌బాబు తదితరులు సంకల్‌బాగ్‌ ఘాట్లో నిరసనలు చేశారు. ఈ సమయంలో వైసీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్‌ ‘మీరెన్ని అరిసినా నాకూడేదేమీ లేదు.. చెప్పుకో’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. 


కరోనా కలకలం : డ్యూటీలో ఉన్న హోంగార్డుకు పాజిటివ్‌ 

కర్నూలు(హాస్పిటల్‌): తుంగభద్ర పుష్కరా ల్లో కరోనా కలకలం రేగింది. నగరేశ్వరస్వామి పుష్కరఘాట్‌ వద్ద విధుల్లో ఉన్న ఓ హోంగార్డుకు కరోనా నిర్ధారణ కావడం ఆందోళనకు దారితీసింది. పుష్కరాల సందర్భంగా కడప జిల్లాకు చెందిన ఓ హోంగార్డుకు ఇక్కడ డ్యూటీ వేశారు. శనివారం ఉదయం దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్న అతన్ని పరీ క్షించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది.  

26 వేల మంది వచ్చారట!

పుష్కరాల్లో స్నానాల రద్దు, ఘాట్లలో సౌకర్యాలలేమి, కొవిడ్‌ కారణంగా పుష్కరాలకు ప్రజలు పెద్దగా రావడంలేదు. కానీ, రికార్డుల్లో మాత్రం రెండో రోజు 26,173 మంది భక్తులు ఘాట్లకు వచ్చినట్లు నమోదు చేశారు. 22,875 మంది స్నానాలాచరించారని, 3,216 పిండ ప్రదానాలు జరిగాయని చెబుతున్నారు. వాస్తవానికి కొన్ని ఘాట్లలో ఇన్‌చార్జులే కనిపించడంలేదు. సంకల్‌బాగ్‌ ఘాట్‌కు వచ్చిన ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఇన్‌చార్జి కోసం పది నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చింది. 

పుష్కర నిధులు 230 కోట్లు దోచేశారు

నదీ స్నానానికి అనుమతించకుంటే.. చలో తుంగభద్ర: బీజేపీ కార్యదర్శి హరీశ్‌బాబు హెచ్చరిక

కర్నూలు అర్బన్‌: ‘‘పుష్కరాల పేరుతో వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులకు, నేతలకు రూ.230 కోట్లు దోచిపెట్టారు. సీఎం జగన్‌ హిందూ సంప్రదాయాన్ని అవమానపరిచారు’’ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి హరీశ్‌బాబు ధ్వజమెత్తారు. శనివారం సంకల్బాగ్‌ ఘాట్‌ వద్ద పుష్కరాల నిర్వహణ తీరుపై మండిపడ్డారు. పుష్కరాల ప్రారంభోత్సవానికి కుటుంబ సమేతంగా సీఎం ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. తుంగభద్రలో స్నానాలకు అనుమతి ఇవ్వకపొతే 22న వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్‌తో కలిసి ‘చలో తుంగభద్ర’ పేరిట ఆందోళనకు దిగుతామన్నారు.


భయపెట్టిన పాము సయ్యాట..

కర్నూలులోని ఘాట్ల వద్ద నీళ్లు కొరవడి  మ ట్టి పెల్లలు, బురదతో దర్శనమిస్తున్నాయి. సీ ఎం జగన్‌ పుష్కర ప్రారంభానికి వస్తున్న కారణంగా పై ప్రాంతాల నుంచి 6,600 క్యూసెక్కులను విడుదల చేసి.. ఆయన వెనుదిరగగానే నిలిపివేశారు. దీంతో సీఎం సందర్శించిన వీ ఐపీ ఘాట్‌ సహా పలు ఘాట్లలో నీటి జాడలు కరువయ్యాయి. నాగసాయి బాబా దేవాలయ ఘాట్‌లో పాము సంచారం భక్తులకు కలవరపరిచింది. ఆ ఘాట్లో చేపలను నోటకరిచిన పా మును విధుల్లో ఉన్న పోలీసులతో సహా పలువురు స్థానికులు సెల్‌ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. ఘాట్లలో నీళ్లు లేకపోవడమే పాము ల సంచారానికి కారణమని స్థానికులు చెప్పుకుంటున్నారు. అయితే, పలు సాంకేతిక సమస్యల కారణంగా నీళ్లు తేలేకపోతున్నామని అధికారులు అంటున్నారు. 

Advertisement
Advertisement