స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉండుంటే ఈ మూవీ షూటింగ్ స్టార్స్ కావాల్సింది. కానీ కరోనా లాక్డౌన్ వల్ల సినిమా షూటింగ్ ఆగింది. దాదాపు రెండు నెలల పాటు షూటింగ్స్ ఆగిపోయాయి. ఇప్పుడు సినీ పెద్దలు ప్రభుత్వంతో షూటింగ్స్ జరిపే విషయంలో చర్చలు జరుపుతున్నారు. విధి విధానాలు రూపొందిన తర్వాత షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. తాజా సినీ వర్గాల సమాచారం మేరకు జూలైలో ‘పుష్ప’ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది.