‘ప్రశ్నిస్తే బ్లాక్‌ లిస్ట్‌లో పెడతారా?’

ABN , First Publish Date - 2021-06-24T05:00:02+05:30 IST

‘ప్రశ్నించే రైతుల పేర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెడతారా?’ అని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి ఏపీ సీడ్స్‌ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతులతో కలసి నిరసన వ్యక్తం చేశారు.

‘ప్రశ్నిస్తే బ్లాక్‌ లిస్ట్‌లో పెడతారా?’
తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణి, రైతులు

 సాలూరు రూరల్‌, జూన్‌ 23:  ‘ప్రశ్నించే రైతుల పేర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెడతారా?’ అని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి  ఏపీ సీడ్స్‌ అధికారుల తీరుపై మండిపడ్డారు.  ఈ మేరకు బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతులతో కలసి నిరసన వ్యక్తం చేశారు. ఆర్జేఎల్‌ విత్తనాలు ఏమయ్యాయని అడిగిన అన్నదాతలను ఏపీ సీడ్స్‌ అధికారులు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వారికి ఏ విత్తనాలు ఇవ్వ బోమని చెప్పడం నియంతృత్వ పాలనకు పరాకాష్టగా ఉందన్నారు.  కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేసే కాంట్రాక్టర్లను సైతం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టని వారు విత్తనాల కోసం అడిగిన రైతులను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నారు. అన్నదాతలపై కేసులు పెడతామని బెదిరించడం సబబు కాదన్నారు. అనంతరం సాలూరు తహసీల్దార్‌ కొట్నాన శ్రీనివాసరావుకు  వినతిపత్రం ఇచ్చారు. ఏపీ సీడ్స్‌ అధికా రులపై జేసీకి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో రైతులు కెల్ల రమేష్‌, నులకల రమేష్‌,  పప్పల మోహనరావు, టీడీపీ నేతలు ఆముదాల పరమేశు, రవివర్మ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-06-24T05:00:02+05:30 IST