పుట్ట గొడుగుల్లా..

ABN , First Publish Date - 2022-01-23T05:30:00+05:30 IST

జిల్లాలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అధికార వైసీపీ ముఖ్య నాయ కులు, ప్రజా ప్రతినిధుల అండతో అనుమతు ల్లేని వెంచర్లు ఊరూరా పుట్టుకొస్తు న్నాయి. ఒక్క అడా పరిధిలోనే 230కి పైగా అక్రమ లేఅవుట్లను గుర్తించి వాటిలో రిజిసే్ట్రషన్లు చేయవద్దని సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయా లకు నివేదిక పంపారు. అయినా.. యథేచ్ఛగా రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. అనుమతు ల్లేని వెంచర్ల వల్ల ల్యాండ్‌ కన్వర్షన చార్జి, ఎల్‌పీ చార్జి, ప్రాసెసింగ్‌ రుసుం రూపాల్లో ఖజానాకు కోట్లాది రూపాయల ఆదాయానికి గండి పడుతోంది.

పుట్ట గొడుగుల్లా..
ప్రొద్దుటూరులో మైలవరం కాలువను అక్రమించి వేసిన అక్రమ లేఅవుట్‌

పట్టణాలు సహా పల్లెల్లోనూ అనుమతులు లేని వెంచర్లు

జిల్లాలో 1,014 గుర్తింపు

అధికార వైసీపీ ముఖ్య నేతల అండ?

ఖాజానాకు రూ.కోట్లలో గండి

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం


జిల్లాలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అధికార వైసీపీ ముఖ్య నాయ కులు, ప్రజా ప్రతినిధుల అండతో అనుమతు ల్లేని వెంచర్లు ఊరూరా పుట్టుకొస్తు న్నాయి. ఒక్క అడా పరిధిలోనే 230కి పైగా అక్రమ లేఅవుట్లను గుర్తించి వాటిలో రిజిసే్ట్రషన్లు చేయవద్దని సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయా లకు నివేదిక పంపారు. అయినా.. యథేచ్ఛగా రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. అనుమతు ల్లేని వెంచర్ల వల్ల ల్యాండ్‌ కన్వర్షన చార్జి, ఎల్‌పీ చార్జి, ప్రాసెసింగ్‌ రుసుం రూపాల్లో ఖజానాకు కోట్లాది రూపాయల ఆదాయానికి గండి పడుతోంది.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో అన్నమయ్య అర్బన డెవలప్‌మెంట్‌ అథారిటీ (అడా) పరిధిలో అక్రమ లేఅవుట్లపై సర్వే నిర్వహించారు. దాదాపు 230కి పైగా అక్రమ లేఅవుట్లు గుర్తించారు. కడప కార్పొరేషన, పులివెందుల, ప్రొద్దుటూరు మున్సిపాలిటీల్లో మెజార్టీ అనుమతులేని వెంచర్లు ఉంటే.. ఆ తరువాత స్థానం బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే ల్యాండ్‌ కన్వర్షన చార్జి, ఎల్‌పీ చార్జి, ప్రాసెసింగ్‌ రుసుం రూపాల్లో ఖజానాకు రూ.వందల కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే.. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల పట్టణాల్లో అక్రమ లేఅవుట్‌ యజమానులకు అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కొందరు ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయి. ఏ అఽధికారి అయినా ధైౖర్యం చేసి అనుమతులు లేని వెంచర్ల వద్దకు వెళ్తే.. ఆ వెంచర్‌ ఎవరిదో తెలిసే వెళ్లావా..? అంటూ ముఖ్య నాయకుల నుంచి ఫోన్లు వస్తుండడంతో వీరు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం.


రాజకీయ అండతో అక్రమ లేఅవుట్లు

లేఅవుట్‌ అప్రూవల్‌ (ఎల్‌పీ) నిబంధనలు కఠినతరం చేయడం, రోడ్లు, ఓపన సైట్‌, వీకర్‌ సెక్షన వారి కోసం 50 శాతం భూమి వదులుకోవాల్సి వస్తుండడంతో అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 20-22 అడుగుల రోడ్లు కూడా వేయకుండానే ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందని వీటిలో ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇబ్బందులు తప్పవు. ఎల్‌పీ లేకుంటే ఇంటి నిర్మాణానికి టౌన ప్లానింగ్‌ అధికారులు అప్రూవల్‌ ఇవ్వరు.. అక్రమంగా నిర్మాణం చేపడితే ఏ క్షణమైనా నోటీసు జారీ చేసి కట్టడాలు కూల్చే అవకాశం ఉంది. అంతేకాదు.. బ్యాంకు రుణాలు ఇవ్వరు. అయితే.. కడప కార్పొరేషన పరిధిలో మాత్రమే 102కు పైగా అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని క్రమబద్ధీకరణ చేస్తే కార్పొరేషన ఖజానాకు వివిధ ఫీజుల రూపంలో దాదాపుగా రూ.75 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఅవుట్ల ద్వారా రూ.4 కోట్లు, రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో 10 అక్రమ లేఅవుట్ల ద్వారా రూ.6 కోట్లు ఆదాయం వస్తుందని పట్టణ ప్రణాళిక అధికారులే అంటున్నారు. అయితే.. ఆ దిశగా చర్యలు శూన్యం. అక్రమ లేఅవుట్‌ యజమానులకు అధికార పార్టీ వైసీపీ ముఖ్య నాయకులు, కీలక ప్రజా ప్రతినిధుల అండ ఉండడం వల్ల చర్యలకు అధికారులు వెనకాడుతున్నారు.


యథేచ్ఛగా రిజిసే్ట్రషన్లు

అనుడా పరిధిలో ఇటీవల సర్వే చేస్తే దాదాపు 230కి పైగా అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించారు. లేఅవుట్ల విస్తీర్ణం సుమారు 650 ఎకరాలు ఉంటుందని అంచనా. అంతకంటే రెట్టింపే ఉంటుందని ఓ అధికారి పేర్కొన్నారు. ఆ లేఅవుట్లలో ఎల్‌పీ ఉంటే తప్ప రిజిసే్ట్రషన్లు చేయవద్దని అడా అధికారులు సర్వే నంబర్ల వారీగా సబ్‌ రిజిసా్ట్రర్‌ అధికారులకు 4 నెలల క్రితమే నివేదిక ఇచ్చారు. అయినా.. సబ్‌ రిజిసా్ట్రర్‌ అధికారులు ఈ నివేదికను పట్టించుకోకుండా యథేచ్ఛగా రిజిసే్ట్రషన్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే.. పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లపై ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. జిల్లాలో 3,966 ఎకరాల్లో 1,014 అనుమతులు లేని వెంచర్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి ద్వారా ప్రభుత్వం రూ.కోట్ల ఆదాయం కోల్పోతోంది. 


లేఅవుట్‌ ప్లాన (ఎల్‌పీ) నిబంధనలు ఇవి

-వ్యవసాయ భూమిని వ్యవసాయేత భూమిగా మార్చుకోవడానికి భూమి విలువపై 5 శాతం ల్యాండ్‌ కన్వర్షన చార్జి చెల్లించాలి. ఉదాహరణకు ఒక ఎకరా రూ.10 లక్షలు రిజిసే్ట్రషన విలువ ఉంటే రూ.50 వేలు ల్యాండ్‌ కన్వర్షన చార్జి చెల్లించాలి.

-లేఅవుట్‌ అప్రూవల్‌ (ఎల్‌పీ) కోసం మున్సిపాలిటీ లేదా పంచాయతీల ద్వారా దరఖాస్తు చేయాలి. ఇందుకోసం ఎల్‌పీ చార్జి చదరపు గజానికి రూ.5 ప్రకారం ఎకరాకు సుమారుగా రూ.25 వేలు చెల్లించాలి. ప్రాసెసింగ్‌ ఫీజు మరో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. 

-లేఅవుటు భూమిలో 33 శాతం రోడ్లు, 12 శాతం ఓపన సైట్‌, ట్రాన్సఫార్మర్లు, అవెన్యూ ప్లాంటేషన కోసం కేటాయించాలి. మరో 5 శాతం ల్యాండ్‌ను వీకర్‌ సెక్షన (పేదల) కోసం కేటాయించాలి లేదా భూమి విలువపై 5 శాతం ప్రభుత్వానికి చెల్లించాలి. సెక్యూరిటీ డిపాజిట్‌ కింద 15 శాతం భూమిని తనఖా (మార్టిగేజ్‌) పెట్టాలి.

-40 అడుగుల రోడ్లు, బీటీ రోడ్డు, పక్కా డ్రైనేజీ, వాటర్‌ పైపులైన, విద్యుత లైన, రోడ్డు ఇరువైపుల మొక్కలు నాటాలి. స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి.. పార్కును అభివృద్ధి చేయాలి.

-ఈ నిబంధనలు పక్కాగా అమలు చేస్తేనే ముందు టెక్నికల్‌ లే అవుట్‌ ప్యాట్రన (టీఎల్‌పీ) ఇస్తారు. ఇందులో ఏమైనా మార్పులు ఉంటే దరఖాస్తుదారుడు ఆ మేరకు మార్పులు చేసిన 15 రోజులకు ఫైనల్‌ ఎల్‌పీ జారీ చేస్తారు. తనఖా పెట్టిన 15 శాతం భూమిని కూడా రిలీజ్‌ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఆనలైన ద్వారానే జరుగుతోంది. 


అక్రమ లేఅవుట్లు సంఖ్య, విస్తీర్ణం (ఎకరాల్లో)

నగరం/పట్టణం లేఅవుట్లు     విస్తీర్ణం

కడప 102    480

ప్రొద్దుటూరు 7    26.41

బద్వేలు 6    30

రాయచోటి 10    50

మైదుకూరు 33    55

పులివెందుల 10    125

ఎర్రగుంట్ల 12    50


రిజిసే్ట్రషన్లు ఆపమని నివేదిక ఇచ్చాం

- క్రిష్ణసింగ్‌, టౌనప్లానింగ్‌ అధికారి, అడా 

అడా పరిధిలో అక్రమ లేఅవుట్లపై ఇటీవల ఓ సర్వే చేశాం. సుమారుగా 230కిపైగా అనుమతులు లేకుండా వెంచర్లు వేసినట్లు గుర్తించాం. అక్రమ లేఅవుట్లలో ఎల్‌పీ లేకుండా రిజిసే్ట్రషన్లు చేయవద్దని కోరుతూ అన్ని సబ్‌ రిజిసా్ట్రర్‌ ఆఫీసుల్లో సర్వే నంబర్ల వారీగా నివేదిక ఇచ్చాం. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వేసి విక్రయాలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవు.

 

Updated Date - 2022-01-23T05:30:00+05:30 IST