YS Jagan కు భయపడే ప్రసక్తే లేదు : మంత్రి పువ్వాడ

ABN , First Publish Date - 2021-07-11T19:39:43+05:30 IST

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడం రోజురోజుకూ ముదురుతోంది.

YS Jagan కు భయపడే ప్రసక్తే లేదు : మంత్రి పువ్వాడ

ఖమ్మం : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడం రోజురోజుకూ ముదురుతోంది. ఇటు తెలంగాణ మంత్రులు.. అటు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.


గాజులు తొడుక్కుని కూర్చోం!

రాజశేఖర రెడ్డి ఆనాడు తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టాడు.. నేడు ఆయన కొడుకు కూడా అదే పని చేస్తున్నాడు. కృష్ణా జలాలు దోచుకుంటున్న దొంగని దొంగ అనే అంటాము. జగన్‌కు భయపడే ప్రసక్తే లేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతాం. ఇప్పటికే కేంద్రానికి మా అభ్యంతరం తెలియజేశాం. అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోము. మీ ఇష్టం వచ్చినట్టు శ్రీశైలం దగ్గర బొక్క కొట్టి కృష్ణా జలాలు దోచుకుంటుంటే ఊరుకునే ప్రశక్తేలేదు. మేమేం గాజులు తొడుక్కుని కూర్చోలేదు. తెలంగాణ రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు కోసం ఎంతదూరమైనా వెళ్లతాం. ఎవరితోనైనా కొట్లాడతాం. మా హక్కుల కోసం మా వాటా కోసం అవసరమైతే దేవునితో అయినా కొట్లాడతామని కేటీఆర్ చెప్పిన విషయం మర్చిపోవద్దుఅని పువ్వాడ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మంలో అడవి మల్లేలలో ‘పల్లె ప్రగతి’ సభలో జలజగడంపై మాట్లాడుతూ పువ్వాడ పై వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2021-07-11T19:39:43+05:30 IST