Abn logo
Oct 8 2021 @ 15:57PM

అసెంబ్లీలో పీవీ చిత్రపటం ఏర్పాటు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ శాసన సభలో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చిత్రపటం ఏర్పాటయ్యింది. భారతదేశ పూర్వ ప్రధానిగా దేశానికి చేసిన సేవలకు గాను,తెలంగాణ బిడ్డ, దివంగత పివీ నరసింహా రావు చిత్రపటాన్ని శాసనసభ భవనంలోని శాసనసభ్యుల లాంజ్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి.శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ఆవిష్కరించారు. 


ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పివి నరసింహా రావు శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు,ఎంపీకే కేశవరావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు రాష్ట్ర మంత్రులు,శాసనసభ విపక్ష నాయకులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పివి నరసింహా రావు కుటుంబ సభ్యులు, అసెంబ్లీ కార్యదర్శి డా. నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption