Tokyo Olympics: సింధు పతకం ఆశలు సజీవం

ABN , First Publish Date - 2021-07-31T22:28:59+05:30 IST

ఒలింపిక్స్‌లో భాగంగా కొద్దిసేపటి క్రితం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పరాజయం పాలైన భారత షట్లర్ సింధు కాంస్య

Tokyo Olympics: సింధు పతకం ఆశలు సజీవం

టోక్యో: ఒలింపిక్స్‌లో భాగంగా కొద్దిసేపటి క్రితం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో పరాజయం పాలైన భారత షట్లర్ సింధు కాంస్య పతకంపై దృష్టిసారించింది. ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి చైనీస్ తైపీ తై జుతో హోరాహోరీగా జరిగిన సెమీస్ పోరులో సింధు వరుస సెట్లలో ఓటమి పాలైంది. తొలి సెట్‌ హోరాహోరీగా సాగినప్పటికీ రెండో సెట్‌లో మాత్రం తై జు దూకుడు ముందు నిలవలేకపోయింది. ఫలితంగా 18-21, 12-21తో ఓటమి పాలైంది. 


సింధు ఓడినప్పటికీ పతకం ఆశలు సజీవంగా ఉన్నాయి. చైనాకే చెందిన హి బింగ్జియావోతో రేపు (ఆదివారం) సాయంత్రం ఐదు గంటలకు కాంస్యం కోసం పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సింధు ఒలింపిక్స్‌లో మరో పతకాన్ని ముద్దాడినట్టే. 

Updated Date - 2021-07-31T22:28:59+05:30 IST