తూకం కాస్త సరిచేసుకోవాల్సిందే..!

ABN , First Publish Date - 2021-02-24T06:45:16+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇంటింటికి రేషన్‌ పంపిణీతో బియ్యం బస్తాల్లో తూకాలు తేటతెల్లం అవుతున్నాయి.

తూకం కాస్త సరిచేసుకోవాల్సిందే..!
తూకం మిషన్‌ సరిచేయించకుంటున్న డీలర్లు

వెలిగండ్ల, ఫిబ్రవరి 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇంటింటికి రేషన్‌ పంపిణీతో బియ్యం బస్తాల్లో తూకాలు తేటతెల్లం అవుతున్నాయి. వాహనం దారులు విధిగా బియ్యం బస్తాను తూకం వేయాలని డిమాండ్‌ చేయండంతో రేషన్‌ ఢీలర్లు తమ తూకం మిషన్లను సరి చేసుకుంటున్నారు. మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం లో డీలర్లు తూకం సరిచేయించు కోవడానికి వరస కట్టారు. రేషన్‌ షాపులోని తూకం మిషన్లు 50 కిలోలు మోసే సామర్థ్యంతో అమర్చారు. ప్ర స్తుతం విధిగా బియ్యం బస్తా ను తూకం వేయలని రేషన్‌ వాహనదారులు కోరుతున్నా రు. దీంతో  ప్రస్తుతం వారి వద్ద ఉన్న మిషన్లు బస్తా తూకం వేయడా నికి సరిపోవడం లేదు. దీంతో  ప్రత్యామ్నా యంగా పై నుంచి వచ్చిన సూచనల మేరకు రేషన్‌ డీలరు వద్ద ఉన్న  తూకాన్ని 50 కిలోల సామర్థ్యం నుంచి 60 కిలోల సామర్థ్యానికి పెంచుతున్నారు. దీంతో డీలర్లు తూకాన్ని సరిచేయించు కోవడానికి తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరకున్నారు.

రేషన్‌ ఢీలర్లు ప్రభుత్వానికి డీడీలు చెల్లించే సమయంలో 50 కిలోలకు చెల్లి స్తారు. వారికి ఆ 50 కిలోల చొప్పున సీలు వేసిన బస్తాను ఇస్తారు. లెక్కకు 50 కిలోల ని అధికారులు చెప్పినప్పటికీ, అవి ఢీలరు వద్దకు వచ్చే సమయానికి 47 నుంచి 48 కిలోల మధ్యలోనే ఉంటాయి..! ఆ మేరకు ప్రతి బస్తాకు రెండు కిలోలు గోడౌన్‌ వద్దే మాయం అవుతాయి. ఈ రెండు కిలోల లెక్క సరిచేయడం కోసం ప్రస్తుతం అధికారులు తలలు పట్టుకుం టున్నారు.  ఇదిలా ఉంటే బియ్యం పంపిణీ మండలంలో సక్రమంగా జరగక పోవడంతో ఉన్నతాధికారులు బియ్యం తీసుకోనివారికి వీఆర్‌వోల లాగిన్‌లో డీలర్లుకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే డీలర్లు మా త్రం తమ లాగిన్‌లో ఇస్తేనే మాకు వచ్చే కమిషన్‌ వస్తుందని పేర్కొంటున్నారు.

Updated Date - 2021-02-24T06:45:16+05:30 IST