క్యూ 1 ఫలితాలు

ABN , First Publish Date - 2021-07-27T06:01:50+05:30 IST

జూన్‌ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.4,450 కోట్ల

క్యూ 1 ఫలితాలు

టాటా మోటార్స్‌: జూన్‌ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.4,450 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.8,444 కోట్లు)తో పోల్చితే నష్టాలు గణనీయంగా తగ్గాయి. త్రైమాసిక కాలంలో ఆదా యం రూ.31,893 కోట్ల నుంచి రూ.66,405 కోట్లకు పెరిగింది. 


ఎల్‌ అండ్‌ టీ: జూన్‌తో ముగిసిన తొలి త్రెమాసికంలో రూ.1,531.66 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది.  గత ఏడాది ఇదే కాలం (రూ.543.93 కోట్లు)తో పోల్చితే నికర లాభం రెండింతలు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.22,037 కోట్ల నుంచి రూ.29,982.70 కోట్లకు పెరిగింది.


కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌: జూన్‌ త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం 32ు వృద్ధి చెంది రూ.1,641.92 కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.7.685.40 కోట్ల నుంచి రూ.8,062.81 కోట్లకు పెరిగింది. మొండి పద్దుల కోసం చేసిన కేటాయింపులు తగ్గినప్పటికీ నికర ఎన్‌పీఏలు 0.87 శాతం నుంచి 1.28 శాతానికి పెరిగాయి.


యాక్సిస్‌ బ్యాంక్‌: జూన్‌ త్రైమాసికంలో రూ.19,591.63 కోట్ల ఆదాయంపై రూ.2,160.15 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.  త్రైమాసిక కాలంలో వడ్డీ ఆదాయం రూ.16.445.47 కోట్ల నుంచి రూ.16,003.46 కోట్లకు పడిపోయింది. నికర ఎన్‌పీఏలు కూడా 1.23 శాతం నుంచి 1.2 శాతానికి తగ్గాయి. 


ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌: జూన్‌ త్రైమాసికంలో రూ.185.73 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.287.59 కోట్లుగా ఉంది. త్రైమాసిక కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.19,057.42 కోట్ల నుంచి రూ.16,724.05 కోట్లకు తగ్గింది. నికర ప్రీమియం ఆదాయం మాత్రం రూ.5,551.07 కోట్ల నుంచి రూ.6,601.85 కోట్లకు పెరిగింది. జూన్‌ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ 31 శాతం వృద్ధి చెంది రూ.లక్ష కోట్ల మార్కును అధిగమించాయి. 


వేదాంత లిమిటెడ్‌: ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసింలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం నాలుగు రెట్లు పెరిగి రూ.4,280 కోట్లుగా నమోదైంది. గత ఏదాది కాలంలో లాభం రూ.1,033 కోట్లుగా ఉంది. త్రైమాసిక కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.16,998 కోట్ల నుంచి రూ.29,151 కోట్లకు పెరిగింది. 


Updated Date - 2021-07-27T06:01:50+05:30 IST