క్యూ 2 ఫలితాలు

ABN , First Publish Date - 2021-10-17T06:30:42+05:30 IST

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.9,096 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే నికర లాభం 18 శాతం పెరిగింది...

క్యూ 2 ఫలితాలు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ : సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో  కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.9,096 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే నికర లాభం 18 శాతం పెరిగింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.38,438.47 కోట్ల నుంచి రూ.41,435.36 కోట్లకు పెరిగింది. 


డీ-మార్ట్‌: సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో  రూ.7,788.94 కోట్ల ఆదాయంపై రూ.417.76 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.198.53 కోట్లు)తో పోల్చితే నికర లాభం రెండింతలు పెరిగింది. 

Updated Date - 2021-10-17T06:30:42+05:30 IST