క్విస్‌ కళాశాలకు ఏఐసీటీయూ ప్రత్యేక గుర్తింపు

ABN , First Publish Date - 2021-06-20T06:17:35+05:30 IST

ఒంగోలులోని క్విస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీయూ) ప్రత్యేక గుర్తింపు నిచ్చిందని, మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా క ళాశాలకు ప్రతిష్టాత్మకమైన ఐటీయూ ల్యాబ్‌ను మంజూరు చేసిదని నిడమానూరి ఎడ్యుకేషనల్‌ సొసైటీ అధ్యక్షుడు నిడమానూరి నాగేశ్వరరావు తెలిపారు.

క్విస్‌ కళాశాలకు ఏఐసీటీయూ ప్రత్యేక గుర్తింపు
పత్రాన్ని చూపుతున్న నిడమానూరి నాగేశ్వరరావు

ఒంగోలువిద్య, జూన్‌ 19 : ఒంగోలులోని క్విస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీయూ) ప్రత్యేక గుర్తింపు నిచ్చిందని, మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా క ళాశాలకు ప్రతిష్టాత్మకమైన ఐటీయూ ల్యాబ్‌ను మంజూరు చేసిదని  నిడమానూరి ఎడ్యుకేషనల్‌ సొసైటీ అధ్యక్షుడు నిడమానూరి నాగేశ్వరరావు తెలిపారు. దేశంలో మొత్తం 49 కళాశాలలను ఏ ఐసీటీయూ ఐడీల్యాబ్స్‌కు ఎంపిక చేయగా రాష్ట్రం లో ఐదు కళాశాలలను ఈ ల్యాబ్స్‌ ఏర్పాటుకు గుర్తించారు. వీటిలో క్విస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఒకటని ఆయన చెప్పారు.  శనివారం స్థానిక క ళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో నాగేశ్వరరావు మాట్లాడుతూ సుమారు రూ. కోటి వ్యయంతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తారని, ఇందులో 50శాతం వ్యయం కళాశాల యాజమా న్యం భరిస్తుందని చెప్పారు. విద్యార్థుల్లోని నైపు ణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ల్యాబ్‌ ఎంతో ఉపయోగకరమన్నారు. దీనిద్వారా విద్యార్థులతో పాటు ఆధ్యాపకుల కూడా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. విద్యార్థులు తమ కల లను సహకారం చేసేందుకు ఇది ఎంతో ఉప యుక్తమని నాగేశ్వరరావు పేర్కొన్నారు. సమావే శం ప్రిన్సిపాల్‌ సీవీ.సుబ్బారావు, అకడమిక్‌ డీన్‌ వెంకటప్రసాద్‌, ఈఈఈ విభాధిపతి మౌళిచం ద్ర, స్కీల్‌డెవలప్‌మెంటు డైరెక్టర్‌ బి.బుజ్జిబాబు, అడ్మిషన్‌ డైరెక్టర్‌ అంకబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T06:17:35+05:30 IST