మహిళల భద్రతకు క్యూఆర్‌ కోడ్‌

ABN , First Publish Date - 2021-04-20T03:45:17+05:30 IST

మహిళల భద్రత కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎస్పీ అపూర్వారావు అన్నారు.

మహిళల భద్రతకు క్యూఆర్‌ కోడ్‌
క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ పోస్టర్‌ను విడుదల చేస్తున్న ఎస్పీ అపూర్వారావు

 ఎస్పీ అపూర్వారావు 

వనపర్తి క్రెం, ఏప్రిల్‌ 19: మహిళల భద్రత కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎస్పీ అపూర్వారావు అన్నారు.  షీటీం క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ పోస్టర్లను సోమవారం  జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. షీటీంకు ఫిర్యాదు చేయాలనుకొనే బాధితులు తమ ఫోన్‌ ద్వారానే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌చేసి ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేం దుకు అవకాశం  కల్పించామన్నారు.  ఈ పోస్టర్లను ఆర్టీసీ బస్సుల్లో, ఆటోల్లో, బస్టాండ్‌ల్లో, సినిమా హాల్స్‌, స్కూల్స్‌, కాలేజీలు, ఇతరము ఖ్యమైన ప్రాంతాల్లో అతికించాలని సిబ్బందిని ఆదేశించారు.  ఫిర్యాదు చేయదలుచుకున్న మహిళ ముందుగానే తమ మొబైల్‌లో క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ను కలిగి ఉండాలన్నారు.  ఫోన్‌తో పోస్టర్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా మీ సమాచారం ఫిర్యాదు ఫోరంలో ఓపెన్‌ అవుతుందన్నారు. అందులోని పేరు, లొకేషన్‌ తదితర వివరాలను పూరించి సబ్‌మిట్‌ చేయగానే పోలీసు కార్యాలయంలోని షీటీం ఐటీ విభాగానికి చేరుతుందని తెలిపారు. అక్కడ సిబ్బంది వెంటనే ఆ సమాచారాన్ని పోలీస్‌ అధికారులకు అందిస్తారని, వారు అక్కడికి చేరుకొని చర్యలు చేపడుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ షాకీర్‌హుస్సేన్‌, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ జమ్ములప్ప, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీను, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌, సీఐ సూర్యనాయక్‌, షీటీం, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-20T03:45:17+05:30 IST