క్యుఆర్‌ కోడ్‌ స్కానింగ్‌లో జాగ్రత్తలు

ABN , First Publish Date - 2022-01-29T05:30:00+05:30 IST

ముఖ్యంగా కొవిడ్‌ అనంతరం వివిధ యాప్‌లు ఉపయోగించి పేమెంట్స్‌ చేయడం పోటెత్తింది. అందులో భాగంగా అక్కడి క్యుఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేయాల్సి ఉంటుంది....

క్యుఆర్‌ కోడ్‌  స్కానింగ్‌లో జాగ్రత్తలు

ముఖ్యంగా కొవిడ్‌ అనంతరం వివిధ యాప్‌లు ఉపయోగించి పేమెంట్స్‌ చేయడం పోటెత్తింది. అందులో భాగంగా అక్కడి క్యుఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. అయితే దీన్ని మోసగాళ్ళు వాటంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయంలో అమెరికాకు చెందిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. దరిమిలా క్యుఆర్‌ కోడ్‌ స్కానింగ్‌లో తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 


 క్యుఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసినప్పుడు యుఆర్‌ఎల్‌ని జాగ్రత్తగా చెక్‌ చేయాలి. టైపో లేదంటే అక్షరాలను అటూ ఇటూ చేసి కొన్ని తప్పుదోవ పట్టించే మాల్వేర్‌లు ఇందులో జొరబడుతున్నాయి. అలాగే కురచ చేసిన యుఆర్‌ఎల్‌తో వెబ్‌సైట్‌ పూర్తిగా కనిపించదని కూడా తెలుసుకోవాలి. 

 క్యుఆర్‌ కోడ్‌తో ఎలాంటి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోరాదు. మాల్వేర్‌ జొరబాటుకు, డేటా తస్కరణకు ఇది వీలు కల్పిస్తుంది. డెడికేటెడ్‌ అంటే ప్లేస్టోర్‌ లేదంటే యాప్‌ స్టోర్‌ నుంచి మాత్రమే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

 కోడ్‌ టాంపర్‌ కాలేదన్న విషయాన్ని కూడా నిర్ధారించుకోవాలి. కోడ్‌లో స్టిక్కర్‌ వంటివి ఏవీ లేకుండా చూసుకోవాలి. అదే యూఆర్‌ఎల్‌ అయితే పూర్తిగా టైప్‌ చేసి తీరాలి. సగం కొట్టగానే ప్రత్యక్షమైనవి కరెక్ట్‌ కాకపోవచ్చు కూడా.


 వెబ్‌సైట్‌పై ఓపెన్‌ అయ్యే క్యుఆర్‌ కోడ్‌తో చెల్లింపులు చేయకూడదు. సరైన పేమెంట్‌ యాప్‌తో మాత్రమే చెల్లింపులు జరపాలి. వీటిలో మాత్రమే రిసీవర్‌ ఐడెంటిటీ తెలుస్తుంది. ఇక్కడ కూడా వెబ్‌సైట్‌ అయితే పూర్తిగా యూఆర్‌ఎల్‌ను కొట్టాల్సి ఉంటుంది. 

 డబ్బు చెల్లింపునకే క్యుఆర్‌ కోడ్‌. అంతే తప్పు డబ్బు అందుకునేందుకు అంటే రిసీవర్‌ స్థానంలో ఉన్నప్పుడు క్యుఆర్‌ కోడ్‌ అవసరం లేదు. ఈ సూక్ష్మాన్ని గుర్తెరిగి మరీ ప్రవర్తించాలి. 

Updated Date - 2022-01-29T05:30:00+05:30 IST