యాపిల్‌ నుంచి క్వాలిటీ ఎయిర్‌పాడ్స్‌

ABN , First Publish Date - 2022-07-09T06:59:03+05:30 IST

బ్లూటూత్‌ హెడ్‌ఫోన్స్‌లో ఆడియో క్వాలిటీకి సంబంధించి ఈ ఎల్‌సీ3 కోడెక్‌ కీలకపాత్ర పోషించనుందని చెబుతున్నారు.

యాపిల్‌ నుంచి క్వాలిటీ ఎయిర్‌పాడ్స్‌

బ్లూటూత్‌ హెడ్‌ఫోన్స్‌లో ఆడియో క్వాలిటీకి సంబంధించి ఈ ఎల్‌సీ3 కోడెక్‌ కీలకపాత్ర పోషించనుందని చెబుతున్నారు. దీనికంటే ముందుగా ఎనర్జీ ఆడియో అంటే ఏమిటో తెలుసుకోవాలి. బ్లూటూత్‌లో రెండు రకాలు - క్లాసిక్‌, ఎల్‌ఈ. ఎల్‌ఈ అంటే లో ఎనర్జీ. లో పవర్‌, లో బ్యాండ్‌విడ్త్‌.  అయితే ఇది ఐఓటి డివైసెస్‌ అంటే స్మార్ట్‌ వాచీలు, ఫిట్‌నెస్‌ బ్యాండ్స్‌కి పరిమితమై ఉంది. బ్లూటూత్‌ క్లాసిక్‌ ద్వారా ఆడియో ట్రాన్స్‌మిషన్‌ జరుగుతుంది. ఎల్‌సీ3(లో కాంప్లెక్సిటీ కమ్యూనికేషన్‌)కోడ్‌ అనేది బ్లూటూత్‌ ఆడియో కోడెక్‌ - లో ఎనర్జీ ప్రొఫైల్స్‌ కోసం ప్రత్యేకించి దీన్ని డిజైన్‌ చేశారు. స్పీచ్‌ను ఎన్‌కోడ్‌ చేయగలదు. అలాగే వివిధ సంగీతాలను ఇన్‌కార్పొరేట్‌ చేసుకోగలదు.


బ్లూటూత్‌ అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఎల్‌సీ3 కోడెక్‌ - ఆడియోను కంప్రెస్‌ చేస్తుంది. ఆడియో క్వాలిటీ దెబ్బతినకుండా చూసుకుంటూనే చిన్నపాటి బిట్‌రేట్‌కి మారుస్తుంది. ఫలితంగా లిమిటెడ్‌ బ్యాండ్‌విడ్త్‌లోనే వేగంగా డేటాని ట్రాన్స్‌మిట్‌ చేసుకోవచ్చు. ‘సౌండ్‌ గైస్‌’ డేటా ప్రకారం ఎల్‌సీ3 స్కేల్‌ 345కేబీపీఎస్‌ ఆడియో ఓఏ 160 కేబీపీఎస్‌. ఎస్‌బీసీ, క్వాల్కామ్‌తో పోల్చుకుంటే కాంపాక్ట్‌(కుదించిన)గా ఉంటుంది. బ్లూటూత్‌ ఎస్‌ఐజి ప్రచురించిన గ్రాఫ్‌ ప్రకారం బిట్‌ రేటు తక్కువగా ఉన్నప్పటికీ ఎస్‌బీసీతో పోల్చుకుంటే ఆడియో క్వాలిటీ బాగా ఉంటుంది. కొత్త కోడ్‌తో పలు ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ ఎనర్జీతో అతి పెద్ద ప్యాకేజీలు పంపుకోవచ్చు. లోబిట్‌ రేట్‌ అంటే తక్కువ బ్యాండ్‌విడ్త్‌ అని అర్థం చేసుకోవాలి. 8కేహెచ్‌జెడ్‌ నుంచి 48 కేహెచ్‌జెడ్‌ వరకు వేర్వేరు రేట్లతో ఆడియో చానల్స్‌ను అపరిమితంగా ఇది సపోర్ట్‌ చేస్తుంది. అంతేకాకుండా ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ కోసం నేటివ్‌ సపోర్ట్‌తో ఎల్‌ఈ ఆడియో వస్తుంది.  


యూజర్లకు మెరుగైన సేవలు అందిస్తూ, తమ ప్రొడక్ట్‌లు అమ్ముకునేందుకు కంపెనీలు తెగ ఉత్సాహపడుతుంటాయి. తాజాగా ఆడియోలో నాణ్యత పెంచడానికి యాపిల్‌ కంపెనీ దృష్టిసారించింది. తదుపరి జనరేషన్‌ యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌లో అందుకోసం ‘ఎల్‌ఈ ఆడియో’, ‘ఎల్‌సీ3 బ్లూటూత్‌ కోడెక్‌’ సపోర్ట్‌ను అందిస్తోంది. ముఖ్యంగా ‘ఎల్‌సీ3 కోడెక్‌’ అంటే ఏమిటి, అది ఎలా  పనిచేస్తుందంటే...

Updated Date - 2022-07-09T06:59:03+05:30 IST