ఎన్‌పీఎస్‌తోనే నాణ్యమైన విద్య: ఆర్జేడీ

ABN , First Publish Date - 2022-01-21T04:28:18+05:30 IST

నూతన విద్యా విధానం(ఎన్‌పీఎస్‌)తోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలమని కడప ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి అన్నారు.

ఎన్‌పీఎస్‌తోనే నాణ్యమైన విద్య: ఆర్జేడీ
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి

చిత్తూరు (సెంట్రల్‌), జనవరి 20: నూతన విద్యా విధానం(ఎన్‌పీఎస్‌)తోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలమని కడప ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి అన్నారు. గురువారం చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో ఎన్‌పీఎస్‌పై చిత్తూరు, మదనపల్లె ఎంఈవోలు, హెచ్‌ఎంలు, కంప్యూటర్‌ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలను మ్యాపింగ్‌ చేయాలన్నారు. 3వ తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా బోధన ఉంటుందని చెప్పారు. అదనపు తరగతి గదులు అవసరాన్ని గుర్తించాలని సూచించారు. అంతకుముందు డీఈవో కార్యాలయంలో డిప్యూటీ డీఈవోలు, ఏడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

Updated Date - 2022-01-21T04:28:18+05:30 IST