అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి

ABN , First Publish Date - 2021-03-03T04:55:48+05:30 IST

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
గోదాం నిర్మాణాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ 

ఆసిఫాబాద్‌, మార్చి 2: అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో రూ.1.54 కోట్లతో నిర్మిసుర్తన్న ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు భద్ర పరిచే గోదాంల నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌ నెలలోగా పనులు పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ డీఈని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అన్నారు. అనంతరం కుమరం భీం చౌరస్తాలో రోడ్డు వెడల్పు పనులను పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్‌కు, అధికారులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. ఆయన వెంట ఆర్‌అండ్‌బీ డీఈ భీంసింగ్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-03T04:55:48+05:30 IST