Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. ఆ దేశం నుంచి వచ్చే వాళ్లకు రెండు కండీషన్స్!

ఇంటర్నెట్ డెస్క్:  కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్(బీ.1.1.529) ఉనికిలోకి వచ్చిన నేపథ్యంలో భారత్‌లోని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా మహారాష్ట్రం ప్రభుత్వం.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులను తప్పనిసరిగా క్వారంటైన్‌కు పంపించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనితోపాటూ..ప్రయాణికులు ఎవరైనా కొత్త వేరియంట్ బారిన పడ్డారో లేదో తెలుసుకునేందుకు వారి రక్త నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు పంపించనుంది. మరోవైపు.. గుజరాత్ ప్రభుత్వం కూడా విదేశీ విమాన ప్రయాణికుల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా, యూరోప్, బ్రిటన్, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోత్సువానా, చైనా, మారిషస్, న్యూజీల్యాండ్, జింబాబ్వే, హాంగ్‌కాంగ్ దేశాల ప్రయాణికులు భారత్‌కు వచ్చాక ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేసింది.


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement