Abn logo
Apr 7 2020 @ 11:12AM

మంచి భోజనం పెడతారా.. క్వారంటైన్‌ నుంచి పారిపోమంటారా!?

అనంతపురం/ధర్మవరం : నాణ్యమైన భోజనం పెట్టాలనీ, లేకుంటే ఇక్కడి నుంచి పారిపోతామని ధర్మవరంలో క్వారంటైన్‌లో ఉన్నవారు సోమవారం ఆందోళనకు దిగారు. ఇటీవల ఢిల్లీలోని జకాత్‌కు వెళ్లివచ్చిన 15 మందికి కరోనా లక్షణాలున్నాయన్న అనుమానంతో పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు 5 రోజుల క్రితం తరలించారు. నాసిరకం భోజనం పెడుతున్నారనీ, తినలేక ఇబ్బందులు పడుతున్నామ ని వారు పేర్కొన్నారు. పస్తులైనా ఉంటాం కానీ, భోజనం చేసేది లేదంటూ భీష్మించారు. ఆర్డీఓ మధుసూదన్‌ దాతలకు ఫోన్‌ చేసి, నాణ్యమైన బియ్యంతో ఆహారం అందించేందుకు చర్యలు తీసుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement