పకడ్బందీగా క్వారంటైన్‌

ABN , First Publish Date - 2020-05-16T05:54:25+05:30 IST

బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలసవెళ్లి వచ్చిన కూలీల క్వారంటైన్‌ సక్రమంగా జరగాలని ఎస్పీ నారాయణ

పకడ్బందీగా క్వారంటైన్‌

ఎస్పీ నారాయణ... బొంరాస్‌పేట, దౌత్తాబాద్‌ మండలాల్లో పర్యటన 


బొంరాస్‌పేట్‌: బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలసవెళ్లి వచ్చిన కూలీల క్వారంటైన్‌ సక్రమంగా జరగాలని ఎస్పీ నారాయణ  అన్నారు. శుక్రవారం డీఎస్పీ శ్రీనివాస్‌, వైద్యాధికారి రవీందర్‌యాదవ్‌, కొడంగల్‌ సీఐనాగేశ్వర్‌రావుతో కలిసి బొంరాస్‌పేట్‌ మండలంలోని మైసమ్మగడ్డతండా, బాపల్లితండా తదితర ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించారు. పూణే, ముంబాయి, హైదరాబాద్‌ నుంచి వలసవెళ్లి వచ్చిన వారితో మాట్లాడారు. కూలీలకు రేషన్‌సరుకులు, నిత్యావసర సరుకుల పంపిణీగురించి నేరుగా కూలీలతో అడిగి తెలుసుకున్నారు.  ఎస్సై వెంకటశ్రీను, పోలీసు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


స్వగామాలకు వచ్చిన వారు హోంక్వారంటైన్‌లో ఉండాలి

బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన  కూలీలు లాక్‌డౌన్‌తో తిరిగి స్వగ్రామాలకు చేరుకన్నారు. వారిని హోం క్వారైంటెన్‌లో ఉండాలని  ఎస్పీ నారాయణ సూచించారు. దౌల్తాబాద్‌ మండలం ర్యాలగట్ట, నంద్యనాయక్‌తండాల్లో ఆయన పర్యటించారు.


వలస కూలీలు ఇంటికే పరిమితం కావాలి

కరోనా నేపథ్యంలో వచ్చిన వలస కూలీలు ఇళ్లకే పరిమితమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అన్నారు. శుక్రవారం కొడంగల్‌ నియోజకవర్గంలో పర్యటించారు.  పూణే, ముంబాయి తదితర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వలస కూలీలు స్వీయ నిర్భంధంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొడంగల్‌ మున్సిపాలిటిలో పారిశుధ్య పనులను పరిశీలించి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ చెర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వినయ్‌కుమార్‌, తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ తదితరులు  పాల్గొన్నారు.


ప్రతీ తండాకు ప్రత్యేక అధికారి

వలస కార్మికులు స్వస్థలాలకు వస్తున్న నేపథ్యంలో ప్రతి గిరిజనతండాకు ప్రత్యేక అధికారిని నియమించినట్లు తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్ర నుంచి 2వేల మంది కార్మికులు మండల పరిధిలోని తండాలకు చేరుకున్నారని తెలిపారు. వచ్చిన వారిని హోంక్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. ఆరోగ్య సిబ్బంది వీరిని పరిశీలిస్తుందని తెలిపారు.


హోం క్వారంటైన్‌లో ఉండని ఆరుగురిపైౖ కేసు

లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా బయట తిరుగుతున్నవారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేఽశ్‌ తెలిపారు. వీరంతా మహారాష్ట్ర నుంచి రెండు రోజుల క్రితం తండాలకు వచ్చారు. 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని చేతులపై ముద్రలు వేసి సూచించారు. కానీ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తూ బయట తిరుగుతున్నారు. దాస్యనాయక్‌ తండా, బండమీది తండాకు చెందిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Updated Date - 2020-05-16T05:54:25+05:30 IST