ఏ జిల్లావారిని అక్కడే క్వారంటైన్‌కు ఆలోచన?

ABN , First Publish Date - 2020-03-29T12:58:42+05:30 IST

ఇతర జిల్లాల వారు ఉంటే వారిని వారి జిల్లా కేంద్రాలకు పంపించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు తెలిసింది.

ఏ జిల్లావారిని అక్కడే క్వారంటైన్‌కు ఆలోచన?

హైదరాబాద్/రాజేంద్రనగర్‌ : రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో ఉన్న క్వారంటైన్‌ సెంటర్లలో ఇతర జిల్లాల వారు ఉంటే వారిని వారి జిల్లా కేంద్రాలకు పంపించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు తెలిసింది. శనివారం రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐపీహెచ్‌ఎం, మేనెజ్‌లలో గల క్వారంటైన్‌ సెంటర్లను శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్‌ క లెక్టర్‌ హరీ్‌ష సందర్శించారు.


ఈ రెండు సెంటర్లలో ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన 130మంది వరకు ఉన్నారని, వారిలో చాలా మంది ఇతర జిల్లాల వారు ఉన్నందున ఏ జిల్లాకు చెందిన వ్యక్తులను ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న క్వారంటైన్‌ సెంటర్లలో పెడితే బాగుంటుందనే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపితే బాగుంటుందని ఆలోచన చేశారు. ఎన్‌ఐపీహెచ్‌ఎం క్వారంటైన్‌ సెంటర్‌కు ఇన్‌చార్జీగా రంగారెడ్డి జిల్లా అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ విభాగం డిప్యూటీ కలెక్టర్‌ హరిప్రియ, మేనెజ్‌లో ఉన్న క్వారంటైన్‌ సెంటర్‌కు జిల్లా మైనారిటీ వెల్ఫేర్‌ సంస్థకు చెందిన రత్నకళ్యాణిని ఇన్‌చార్జీలుగా నియమించారు.

Updated Date - 2020-03-29T12:58:42+05:30 IST