క్వారీ, క్రషర్స్‌ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-01-27T06:27:22+05:30 IST

క్వారీ, క్రషర్స్‌ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.

క్వారీ, క్రషర్స్‌ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
బవులవాడలో క్రషర్స్‌ వద్ద నిరసన తెలుపుతున్న కార్మిక కుటుంబాలు

తుమ్మపాల, జనవరి 26: క్వారీ, క్రషర్స్‌ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. బవులవాడలోని క్రషర్‌ వద్ద కుటుంబాలతో బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. యూనియన్లను వదిలి వస్తేనే కార్మికులను విధుల్లోకి చేర్చుకుంటామని యాజమాన్యం పట్టుబట్టడం అన్యాయమని సంఘం నాయకులు సిహెచ్‌ఎస్‌ఎన్‌ మూర్తి, బి.రామకృష్ణ పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలిసిన వెంటనే రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కార్మికుల కుటుంబాలతో చర్చించారు. సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు.


Updated Date - 2021-01-27T06:27:22+05:30 IST