Advertisement
Advertisement
Abn logo
Advertisement

రంగు మారిన క్వీన్ ఎలిజబెత్ చేతులు.. మ్యాటర్ ఏంటో చెప్పేసిన వైద్యులు

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌కు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోను చూసి, స్పందిస్తున్న నెటిజన్లు.. ఆమె చేతులు రంగు మారడంపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


వెన్నెముక గాయంతో దాదాపు నెల రోజులుపాటు విశ్రాంతి తీసుకున్న బ్రిటన్ రాణి.. ఈ మధ్యే కోలుకున్నారు. తిరిగి తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 19న ఆమె.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ సర్ నిక్ కార్టర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను  బకింగ్‌హమ్ ప్యాలెస్ తాజాగా విడుదల చేసింది. ఆ ఫొటోలో క్వీన్ ఎలిజబెత్ చేతులు రంగు మారి కనిపించడంతో.. అదికాస్తా వైరల్ అయింది. దీంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. బ్రిటన్ రాణి చేతులు ఉదారంగులోకి ఎందుకు మారాయి? అని ప్రశ్నిస్తూనే.. ఆమెకు ఏమైనా ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైద్య నిపుణులు స్పందిస్తున్నారు. బ్రిటన్ రాణి చేతులు ఉదారంగులోకి మారడంపట్ల ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేస్తున్నారు. డీ ఆక్సిజినేటెడ్ బ్లడ్ వల్ల అలా రంగు మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఫొటోలో క్వీన్ ఎలిజబెత్‌తో పాటు ఉన్న నిక్ కార్టర్ చేతులు కూడా అదే రంగులో ఉండటాన్ని చూడవచ్చు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement