కుందేలు ఉపాయం

ABN , First Publish Date - 2020-07-29T05:05:53+05:30 IST

ఒక దట్టమైన అడవిలో ఏనుగుల గుంపు నివసించేది. ఆ అడవిలోని ఒక చిన్న కొలనులో ఆ ఏనుగులు తిష్ఠ వేసుకుని కూర్చుండేవి. ఇతర జంతువులను నీళ్లు తాగనిచ్చేవి కాదు...

కుందేలు ఉపాయం

ఒక దట్టమైన అడవిలో ఏనుగుల గుంపు నివసించేది. ఆ అడవిలోని ఒక చిన్న కొలనులో ఆ ఏనుగులు తిష్ఠ వేసుకుని కూర్చుండేవి. ఇతర జంతువులను నీళ్లు తాగనిచ్చేవి కాదు. అదే ప్రాంతంలో కొన్ని కుందేళ్లు నివసించేవి. ఆ ఏనుగల ఆగడాలను భరించలేక ఒకరోజు కుందేళ్ల రాజు, ఏనుగుల రాజు దగ్గరకు వెళ్లింది. ఏనుగుల వల్ల తమకు జరుగుతున్న ఇబ్బందులను ఆ ఏనుగు దృష్టికి తీసుకెళ్లింది. కానీ ఏనుగుల రాజు కుందేలు చెప్పిన విషయాన్ని తేలికగా కొట్టిపారేసింది. దాంతో ఎలాగైనా  ఏనుగుల రాజుకు బుద్ది చెప్పాలని ఒక పథకం వేసింది. ‘‘ఆ కొలను చంద్రుడిది. మీ ఏనుగుల ప్రవర్తన వల్ల చంద్రుడికి బాగా కోపం వస్తోంది. తప్పకుండా చంద్రదేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు’’అన్నది కుందేలు. ఆ విషయాన్ని ఏనుగు నమ్మలేదు. ‘‘నన్ను ఒకసారి చంద్ర దేవుడి దగ్గరకు తీసుకెళ్లు’’ అని అడిగింది. అందుకు ‘సరే’ అన్న కుందేలు పౌర్ణమి రోజున ఏనుగుల రాజును కొలను దగ్గరకు తీసుకెళ్లి నీటిలో చంద్రబింబాన్ని చూపించింది. అది చూసిన ఏనుగు నిజంగానే చంద్రుడు భూమిపైకి వచ్చాడని నమ్మి, ఇకపై ఏనుగుల గుంపు ఈ కొలను వద్దకు రాకుండా చూస్తానని మాట ఇచ్చింది. ఆరోజు నుంచి జంతువులన్నీ స్వేచ్ఛగా కొలనులో నీటిని తాగుతూ జీవించాయి.

Updated Date - 2020-07-29T05:05:53+05:30 IST