Advertisement
Advertisement
Abn logo
Advertisement

చస్తామన్నా..చలించరా..?


 రాచపల్లి రెవెన్యూలో ముందుకు సాగని భూముల సర్వే 

 ఏళ్ల తరబడి మూడు గ్రామాల రైతుల ఎదురుచూపులు

  సర్వే చేయకుంటే  ‘మా చావులు చూస్తారు’ అంటూ ఇటీవల తహసీల్దార్‌కు  హెచ్చరిక

 వైసీపీలో వర్గ పోరు వల్లే సర్వే  సాగలేదని ఆవేదన  

 న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు టీడీపీ నేతలు సన్నాహాలు

మాకవరపాలెం, డిసెంబరు 4 : ఏపీఐఐసీ పేరిట నమోదైన తమ భూములకు సర్వే జరిపి, ఆన్‌లైన్‌ చేయాలని దీర్ఘకాలంగా ఆ మూడు గ్రామాల రైతులు డిమాండ్‌ చేస్తు న్నారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. అయినప్పటికీ అధి కారుల్లో స్పందన కరువైంది. చివరకు చేసేది లేక సమస్యపై స్పందించకుంటే ‘మా చావులు చూస్తారు’ అంటూ ఏకంగా గత సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుటే ఆందోళనకు దిగారు. ఇంత జరుగుతున్నా సర్వే మాత్రం ఆరంభం కాలేదు. ఇందుకు అధికారుల నిర్లక్ష్యం కొంతతో పాటు వైసీపీలో వర్గపోరు కూడా ఒక కార ణమనే వాదన బలంగా వినిపిస్తోంది. మాకవరపాలెం మండలం రాచపల్లి, ఎరకన్నపాలెం, ధర్మవరం గ్రామాల రైతులకు చెందిన భూములను  2008 లో అన్‌రాక్‌ రిఫైనరీకి సేకరించారు. ఇందులో మిగిలి ఉన్న సుమారు 500 ఎకరాల భూమిని ఏపీఐఐసీ పేరిట నమోదైంది. అధికారులు చేసిన  ఈ తప్పిదానికి పన్నెండు సంవత్సరాలుగా తామంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని ఆయా రైతులు వాపోతూనే ఉన్నారు. ఇదిలావుంటే, భూములు సర్వే కోసం గత సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మూడు గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. దీంతో తహసీల్దార్‌ రాణి అమ్మాజీ వారితో మాట్లాడారు. తక్షణమే భూముల సర్వే జరిపి, అన్‌లైన్‌ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సర్వే ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇందుకు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఇక్కడి వైసీపీ వర్గపోరు కాస్త ఇప్పుడు భూముల సర్వే పై పడింది. రాచపల్లిలో మొదటి నుంచి జడ్పీటీసీ భర్త పెట్ల భద్రాచలం  ఒక వర్గం, రుత్తల జమిందార్‌ మరో వర్గంగా ఉన్నారు. వీరు ఇరువురు సర్పంచ్‌ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఇరు వర్గాలమధ్య మరింత దూరం పెరిగింది.  ఈ నేపథ్యంలోనే రుత్తల జమిందార్‌ రైతుల భూములను సర్వే చేయాలంటూ తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఇదే ఆం దోళనలో టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. మొత్తానికి సర్వేకు అధికారులను ఒప్పించారు. అయితే సర్వేకు అధికారులు వస్తారని రైతులు అందరూ వారి వద్ద ఉన్న భూ రికార్డుల ఆధారాలు పట్టుకొని గ్రామంలో ఉన్న భూముల వద్ద ఉండగా, ఇద్దురు సచివాలయం సర్వేర్లు వచ్చారు. అయితే ఇంతలోనే అధికారులు రావడం లేదని సమాచారం రావడంతో రైతులు తీవ్ర నిరాశ చెందారు. సర్వేకు వస్తామన్న అధికారులు ఎందుకు రాలేదని రుత్తల జమిందార్‌తో పాటు రైతులు అరా తీశారు. మరో వైసీపీ నాయకుడు సర్వే చేయరాదని తమ ముఖ్యమైన నాయకుడితో అధికారులకు పోన్‌ చేయించారని, అందు వల్లే సర్వే అగిపోయిందని ఆయన తెలిపారు. దీంతో వైసీపీ నాయకుడు రుత్తల జమిందార్‌ ఎమ్మెల్యే గణేశ్‌ వద్దకు రైతులను తీసుకు వెళ్లేందుకు చూడగా, ఆ ప్రయ త్నం కూడా బెడిసికొట్టింది. భూముల సర్వే కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రైతులకు వైసీపీలో వర్గపోరు శాపంగా మారిందని భావిస్తున్న టీడీపీకి చెందిన సర్పంచ్‌ రుత్తల సీతారాముడు, ఎంపీటీసీ రుత్తల యర్రాపాత్రుడు న్యాయం స్థానాన్ని ఆశ్రయించి, తద్వారా సర్వేకు ఆదేశాలు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తు న్నారని సమాచారం.  ఏది ఏమైన ప్పటికీ సర్వే చేయకపోతే తాడోపేడో తెల్చుకుంటామని రైతులంతా ముక్త కంఠంలో చెపుతున్నారు. 

Advertisement
Advertisement