Oct 23 2021 @ 12:09PM

Radhe Shyam: నేను దేవుడిని కాదు.. మీలో ఒక్కడిని కూడా కాదు!

ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ వచ్చేసింది. వింటేజ్‌ లవ్‌స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను డార్లింగ్‌  ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా శనివారం సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే హస్త సాముద్రిక నిపుణుడి పాత్రలో కనిపించనున్నారు. టీజర్‌లో ప్రభాస్‌ లుక్‌ స్టైలిష్‌గా ఉంది. ‘‘నువ్వు ఎవరో నాకు తెలుసు. కానీ నీకు చెప్పను. నీ హృదయం ఎప్పుడు ముక్కలవుతుందో నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ చావు నాకు తెలుసు కానీ నీకు చెప్పను. నాకు అన్నీ తెలుసు.. కానీ నీకు చెప్పను. ఎందుకంటే, చెప్పినా మీ ఆలోచనలకు అది అందదు. నా పేరు విక్రమాదిత్య. నేను దేవుడిని కాదు. మీలో ఒక్కడిని కూడా కాదు’’ అంటూ ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. జస్టిన్‌ ప్రభాకరన్‌ అందించిన నేపథ్య సంగీతం హాంటింగ్‌గా ఉంది.  రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే కథనాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.