'రాధే శ్యామ్': అప్‌డేట్స్ లేటవడానికి కారణమిదేనా..?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ వింటేజ్ లవ్ స్టోరి 'రాధే శ్యామ్'. ఈ సినిమా నుంచి అభిమానులు ఆశించినంత త్వరగా అప్‌డేట్స్ రాకపోవడానికి కారణం ఇదేనంటూ ఓ తాజా వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇందులో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు సౌత్ భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా హిందీ వెర్షన్‌కు మాత్రం మనన్ భరద్వాజ్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఇదే కారణంతో హిందీ వెర్షన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ బాగా డిలే అవుతున్నాయట. కేవలం సాంగ్స్ విషయంలోనే కాకుండా సినిమా పరంగానూ హిందీ వెర్షన్‌కు, తెలుగు వెర్షన్‌కు డిఫరెంట్ ప్రజెంటేషన్స్ ఉన్నాయట. అందుకే  'రాధే శ్యామ్' మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ బాగా డిలే అవుతునట్టు సమాచారం. కాగా, ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా 2022, జనవరి 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement
Advertisement