Abn logo
Sep 18 2020 @ 20:56PM

తన తండ్రితో ఉన్న చిన్ననాటి ఫొటోని షేర్‌ చేసిన రాధిక

Kaakateeya

తండ్రి ఎమ్‌.ఆర్ రాధ వర్థంతి (సెప్టెంబర్‌ 17) సందర్భంగా నటి రాధిక ఒక రేర్‌ పిక్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకున్న రాధిక తనతో ఆమెకున్న అనుబంధాన్ని తెలియజేశారు. చిన్నప్పుడు రాధిక ఎలా ఉండేవారో ఆమె షేర్ చేసిన ఈ ఫొటోలో తెలుస్తుంది. అలాగే ఆమె తండ్రి పౌరాణిక పాత్రలో కనిపిస్తున్నారు. మా మనసుల్లో మీరు ఎప్పుడూ ఉంటారు. నా పనిలో మీరెప్పుడూ ప్రతిబింబిస్తుంటారు. నా తండ్రి ఎమ్‌. ఆర్‌ రాధ వర్థంతి సందర్భంగా నా మనసులో ఉన్నమాటలు చెబుతున్నాను.." అని రాధిక తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

దీనికి.. నిజం చెప్పారు మేడమ్‌.. గొప్ప నటుడు. ఈ సందర్భంగా ఆయనని తలుచుకోవడం చాలా గొప్పగా ఫీలవుతున్నాం.  ఎన్నో గొప్ప పాత్రలతో మమ్మల్ని అలరించారు. మీ పేరు ఎప్పటికీ నిలిచి ఉండాలని కోరుకుంటున్నాము.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement