ముల్లంగి తొక్కు

ABN , First Publish Date - 2021-04-22T20:55:49+05:30 IST

ముల్లంగి- మూడు(లేతవి), టమోటా- రెండు, ఉల్లిపాయలు- రెండు, ఉప్పు, నూనె, నీరు- తగినంత, చింతపండు రసం- రెండు స్పూన్లు, తాలింపు గింజలు- ఓ స్పూను, ఎండు కారం- ఓ స్పూను, పసుపు- చిటికెడు.

ముల్లంగి తొక్కు

కావలసిన పదార్థాలు: ముల్లంగి- మూడు(లేతవి), టమోటా- రెండు, ఉల్లిపాయలు- రెండు, ఉప్పు, నూనె, నీరు- తగినంత, చింతపండు రసం- రెండు స్పూన్లు, తాలింపు గింజలు- ఓ స్పూను, ఎండు కారం- ఓ స్పూను, పసుపు- చిటికెడు.


తయారుచేసే విధానం: ముందుగా ఉల్లిపాయలు, టమోటా, ముల్లంగి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఓ పాన్‌లో నూనె వేసి అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేగాక టమోటా ముక్కలు ఉప్పు, కారం, చింతపండు రసం వేయించాలి. టమోటాలు దగ్గరగా అయ్యాక ముల్లంగి ముక్కలు వేసి బాగా కలపాలి. ఓ కప్పు నీళ్లు పోసి మూతపెట్టి పది నిమిషాలు మగ్గించాలి. ఆ తరవాత పోపు వేస్తే సరి.

Updated Date - 2021-04-22T20:55:49+05:30 IST