వైరల్: తిక్క తీర్చే గది.. ఇక్కడ అడుగుపెడితే చాలు ఫ్రస్ట్రేషన్ మొత్తం మాయం!

ABN , First Publish Date - 2021-02-22T02:51:24+05:30 IST

Brazil’s Sao Paulo helps people to vent their anger

వైరల్: తిక్క తీర్చే గది.. ఇక్కడ అడుగుపెడితే చాలు ఫ్రస్ట్రేషన్ మొత్తం మాయం!

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రస్ట్రేషన్.. అసహనం..భరించలేని అసహనం.. మనిషికి ఆధునిక జీవనశైలి అందించిన గిఫ్ట్ ఇది. ఈ భావనను అదుపులో పెట్టుకోలేక..ఉద్రేకాన్ని నలుగురిలో ప్రదర్శించి అనేక మంది కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు. దీనికి పరిష్కారంగా ఏర్పాటైందే.. తిక్క తీర్చే గది. అవును..బ్రెజిల్ వ్యాపారవేత్త ఆలోచనల నుంచి పుట్టిన పరిష్కారంమే ఈ గది. దీనికి ఆయన రేజ్ రూం అని పేరు పెట్టుకున్నారు. ఈ గదిలో ఫ్రిడ్జ్, టీవీ, అద్దం.. ఇలా అన్ని వస్తువులూ ఉంటాయి. కోపం పతాక స్థాయికి చేరి కుతకుతా ఉడిపోతున్న వారందరూ ఈ గదిలోకి వెళ్లి అక్కడ విధ్వసం సృష్టించవచ్చు. తమ కోపాన్నంతా అక్కడి వస్తువులపై ప్రదర్శించవచ్చు. కవాల్సినంత కల్లోలం సృష్టించవచ్చు. ఎటువంటి పరిమితులూ ఉండవు. ఆవేశం పూర్తిగా చల్లారాక ప్రశాంత మనస్కులై బయటిరావచ్చు. ఈ సేవలు పొందేవారికి తమ ఫ్రస్ట్రేషన్ తీర్చుకునే క్రమంలో దెబ్బలు తగలకుండా ఉండేందుకు అక్కడ ప్రత్యేక హెల్మెట్, దుసులు కూడా లభిస్తాయి. 


వాండర్లీ రోడ్రీగెస్ అనే వ్యాపార వేత్త ఈ ఫ్రస్ట్రేషన్ గదిని సావొపావొలో నగరంలో ఏర్పాటు చేశారు. అయితే.. ఈ గదిలోకి వెళ్లాలనుకునే వారు 4.64 డాలర్లు చార్జీల కింద చెల్లించుకోవాలి. ముందు మనం చెప్పుకున్నట్టు..ఫ్రస్ట్రేషన్ మన జీవితాల్ని కకావికలం చేస్తున్న కాలమిది. కాబట్టే..ఈ గదికి డిమాండ్ కూడా బాగానే ఉంది. అనేక  మంది తమ కోపాల్ని ఈ గదిలో వదిలించుకుని..కొత్త ఆనందాన్ని పొందుతున్నారట. కావాలంటే..మీరూ ఓ మారు ట్రై చేసుకోవచ్చు!

Updated Date - 2021-02-22T02:51:24+05:30 IST