Abn logo
May 23 2020 @ 11:47AM

`అన్నమయ్య`ని ఎప్పటికీ మర్చిపోలేను: రాఘవేంద్రరావు

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, `కింగ్` నాగార్జున కెరీర్లోనే కాదు.. తెలుగు సినిమా చరిత్రలోనే ఓ మరపురాని చిత్రంగా నిలిచింది `అన్నమయ్య` చిత్రం. ఈ చిత్రం విడుదలై శుక్రవారంతో 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ రోజు (శనివారం) రాఘవేంద్రరావు జన్మదినోత్సవం. ఈ సందర్భంగా `అన్నమయ్య` సినిమాను రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు. 


`23 ఏళ్ల క్రితం.. నా జన్మదినోత్సవానికి ఒక రోజు ముందు.. నా జీవితంలోనే ప్రత్యేకమైన సినిమా విడుదలైంది. `అన్నమయ్య`.. నేను జీవితాంతం గుర్తుంచుకునే సినిమా. ఈ సినిమా చేసే అవకాశం నాకు కల్పించిన ఆ భగవంతునికి కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన నాగార్జున, మోహన్‌బాబు, సుమన్, రమ్యకృష్ణ, కస్తూరి, కీరవాణి, భారవి, నిర్మాత దొరస్వామిరాజుగారు.. ఆ సినిమా కోసం పని చేసిన అందరికీ ధన్యవాదాలు` అని రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement