Abn logo
Aug 5 2020 @ 10:43AM

రామ భక్తుల కల నిజమైన రోజు: కె.రాఘ‌వేంద్ర‌రావు

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం భూమిపూజ అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. ప్రధాని మోదీ స్వయంగా హాజరై.. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించనున్నారు. తద్వారా ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 44 నిమిషాల 40 సెకన్లదాకా.. అంటే 32 సెకన్లలోపు ఈ కార్యక్రమం పూర్తవుతుంది. శంకుస్థాపనకు సకల సన్నాహాలు పూర్తయ్యాయి. సోమవారమే మొదలైన పూజలు.. భూమిపూజతో బుధవారం మధ్యాహ్నం పూర్తవుతాయి. దేశం, ప్ర‌పంచం యావత్తు ఉన్న హిందువులు ఇదొక గొప్ప క్ష‌ణ‌మ‌ని ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.


 ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ట్విట్ట‌ర్ ద్వారా త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా త‌ను డైరెక్ట్ చేసిన ‘శ్రీరామదాసు’ చిత్రంలోని రామ ఆగ‌మ‌న స‌న్నివేశానికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశారు. ‘‘ఎన్నో ఏళ్లు ఎదురు చూసిన రామ‌భ‌క్తుల క‌ల నిజ‌మైన రోజు ఇది. ‘శ్రీరామ‌దాసు’ సినిమాను డైరెక్ట్ చేసిన వ్య‌క్తిగా గ‌ర్వ‌ప‌డ‌తాను’’ అని తెలిపారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు


Advertisement
Advertisement
Advertisement