ఉద్యోగులపై జగన్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఎంపీ రఘురామ ఉపవాస దీక్ష

ABN , First Publish Date - 2022-01-19T15:46:23+05:30 IST

న్యూఢిల్లీ: ఏపీ ఉద్యోగులకు సంఘీభావంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు దీక్షకు దిగారు.

ఉద్యోగులపై జగన్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఎంపీ రఘురామ ఉపవాస దీక్ష

న్యూఢిల్లీ: ఏపీ ఉద్యోగులకు సంఘీభావంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు దీక్షకు దిగారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని తన అధికార నివాసంలో ఉపవాసదీక్ష చేపట్టారు. ఈ దీక్ష సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఆవేదనను బేఖాతరు చేస్తూ జగన్ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలను విడుదల చేయడంపై ఉద్యోగులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు మద్దతుగా రఘురామ బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉపవాస దీక్ష చేపట్టారు.


అధికారుల కమిటీ అనేక సిఫార్సులు చేసినప్పటికీ ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాలను శాశ్వతంగా దెబ్బతీసే విధంగా ప్రతి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు నష్టం జరిగే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రఘురామ వ్యతిరేకించారు. మిశ్రా కమిషన్ నివేదికను బహిర్గతం  చేయకుండా సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ నివేదిక ఆధారంగా చేసినటువంటి పీఆర్సీ సంబంధిత అంశాల ప్రకటనను రఘురామ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా 30 శాతం ఫిట్‌మెంట్‌తో 1-7-2019 ఆర్థిక ప్రయోజనాలతో ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని రఘురామ డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2022-01-19T15:46:23+05:30 IST