బోసడీకే అంటే తిట్టు కాదు.. అర్థం ఇదీ..: Raghu Rama Krishna Raju

ABN , First Publish Date - 2021-10-20T19:42:18+05:30 IST

ఏపీలో చర్చనీయాంశంగా మారిన ‘బోసడీకే’ పదానికి ఎంపీ రఘరామ కృష్ణ రాజు అర్థం వెతికి చెప్పారు.

బోసడీకే అంటే తిట్టు కాదు.. అర్థం ఇదీ..: Raghu Rama Krishna Raju

న్యూఢిల్లీ: ఏపీలో చర్చనీయాంశంగా మారిన ‘బోసడీకే’ పదానికి ఎంపీ రఘరామ కృష్ణ రాజు అర్థం వెతికి చెప్పారు. ఏపీలో పరిస్థితులపై రఘురామ రాజు గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. బోసడీకే అంటే తిట్టు కాదని తేల్చారు. బోసడీకే అంటే అర్థం ‘మీరు బాగున్నారా’ అని గూగుల్‌లో ఉందని రఘురామ తెలిపారు. ‘‘టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి గారు అన్న ఈ పదానికి అర్థం ఏంటా? అని నా స్నేహితులు పాతికమందిని అడిగా. వైసీపీలోని నా అజ్ఞాత స్నేహితులను కూడా అడిగా. ‘ఏమో మాకూ తెలీదు.. ఏదో బూతు పదమేమో’ అని చెప్పారు. అప్పుడు నేను గూగుల్‌లో వెతికా. అందులో చాలా స్పష్టంగా ఉంది. ‘సర్.. మీరు బాగున్నారా’ అనేది సంస్కృతంలో బోసడీకే అనేదానికి అర్థం.’’ అని రఘురామ రాజు వివరించారు.

Updated Date - 2021-10-20T19:42:18+05:30 IST