మీసం మెలేసిన రఘురామ

ABN , First Publish Date - 2021-05-18T01:00:13+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వంపైనా, ప్రభుత్వ పెద్దలపైనా వరుసగా విమర్శల బాణాలు సంధిస్తున్న... అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసులు అరెస్టు చేశారు.

మీసం మెలేసిన రఘురామ

గుంటూరు: సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఐడీ అధికారులు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజును హైదరాబాద్‌కు తరలిస్తున్న వేళ ఆసక్తికర ఘటన ఒకటి వెలుగుచూసింది. కారులో ఉన్నంత సేపు ఎంపీ తన మీసాన్ని మెలేస్తూ కనిపించారు. మీడియా కెమెరాలు కనిపించగానే మీసాన్ని తిప్పుతూ కనిపించడం వెనక ఏదో ఉద్దేశం ఉండే ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా సీఐడీ అధికారులు తనను బలవంతంగా జైలుకు పంపాలన్న పాచిక పారలేదన్న ఉద్దేశంతోనే ఆయనిలా మీసం తిప్పి ఉంటారని అంటున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు బెడిసికొట్టడంతో నైతికంగా తాను విజయం సాధించానని చెప్పడం కూడా ఆయన ఉద్దేశం అయి ఉంటుందని నాయకులు విశ్లేషిస్తున్నారు. 


ప్రభుత్వంపై కుట్రకు పాల్పడుతున్నారంటూ రాఘురామ రాజును రెండు రోజుల క్రితం సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి గుంటూరు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆయనను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. 

Updated Date - 2021-05-18T01:00:13+05:30 IST