ABN MD వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదు చేయడం కక్ష్య సాధింపే..: రఘురామ

ABN , First Publish Date - 2021-12-13T21:00:17+05:30 IST

లక్ష్మి నారాయణ ఇంటిపై సీఐడీ పోలీసుల సోదాలు, కేసుల నమోదు కక్ష్య సాధింపు మాత్రమేనని...

ABN MD వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదు చేయడం కక్ష్య సాధింపే..: రఘురామ

న్యూఢిల్లీ: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మి నారాయణ ఇంటిపై సీఐడీ పోలీసుల సోదాలు, కేసుల నమోదు కక్ష్య సాధింపు మాత్రమేనని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీ నారాయణ ఇంట్లో సోదాలు జరుగుతున్న విషయం తెలుసుకున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ  ఆయన నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో పోలీసులు ఆర్కేను ఉండమని చెప్పిన విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తిరిగి రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా కక్ష్య సాధింపేనన్నారు.


ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోలీసులను దారుణంగా వాడుకుంటోందని రఘురామ విమర్శించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవనే విషయం పోలీసులు గుర్తు పెట్టుకోవాలన్నారు. తప్పులు చేసే పోలీసులు కూడా శిక్షలకు సిద్ధంగా ఉండాలన్నారు. రిటైర్డ్ జడ్జి చంద్రుడు రాష్ట్ర ప్రభుత్వానికి మరో అంబాసిడర్‌గా తయారయ్యారన్నారు. న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా చంద్రుడు మాట్లాడారని, ఆయన వ్యవహారంపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు లేఖ రాస్తానన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ఏపీ ప్రభుత్వం అందరికీ హనీ చేస్తోందని రఘురామ అన్నారు.

Updated Date - 2021-12-13T21:00:17+05:30 IST