Advertisement
Advertisement
Abn logo
Advertisement

25 వేల ఓట్లకుపైగా మెజారిటీతో బీజేపీ అభ్యర్థే గెలుపు: రఘునందన్‌రావు

హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నిలో 25వేల ఓట్లకుపైగా మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ హుజురాబాద్ మండలం, మున్సిపాలిటీలో బీజేపీకి ఓట్లు రావాలంటే చాలా కష్టమని ముందుగానే భావించామన్నారు. అయితే 1,2,3 రౌండ్లలో బీజేపీకి ఆధిక్యత వస్తే.. 22 రౌండ్ల వరకు ఇదే ఆధిక్యత కొనసాగుతుందని అన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరంలేదన్నారు. చివరికి 25వేల ఓట్ల పై మెజారిటీతో భారతీయ జనతాపార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement