Abn logo
Nov 22 2020 @ 16:59PM

హైదరాబాద్‌కు టీఆర్‌ఎస్‌ ఏం చేసింది? రఘునందన్‌

Kaakateeya

హైదరాబాద్: హైదరాబాద్‌కు బీజేపీ ఏం చేసిందని అధికార పార్టీ నేతలు అడుగుతున్నారని, ఇదే హైదరాబాద్‌కు టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ ప్రతిదాడి చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మంచినీటి సరఫరాపై టీఆర్‌ఎస్‌ నేతలు స్టడీ టూర్‌ చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ వచ్చాకే హైదరాబాద్‌లో అరాచకాలు పెరిగాయని అన్నారు.


దేశ రక్షణ కేంద్ర ప్రభుత్వ బాధ్యతని, యాక్షన్‌కు రియాక్షన్‌ తప్పకుండా ఉంటుందని రఘునందన్ అన్నారు. కేటీఆర్‌ సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవాని అన్న ఆయన కేటీఆర్‌కు తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మాకు ఇష్టం ఉన్న ఆలయానికి వెళ్తామని, అడగడానికి మీరెవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై కేసీఆర్ యుద్ధం చేస్తామంటున్నారని, ఫామ్‌హౌస్‌లో కూర్చొని గ్లాసులు కడుక్కోవడం యుద్ధమా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేయాలని రఘునందన్‌రావు అన్నారు.

Advertisement
Advertisement