Advertisement
Advertisement
Abn logo
Advertisement

జలదిగ్బంధంలో రఘునాధపురం

బద్వేలు రూరల్‌, నవంబరు 30: భారీ వర్షాల కారణంగా లక్ష్మీపాళెంలో ఉన్న పెద్ద చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రఘునాధపురం, తిరువెంగళాపురం గ్రామాల ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. రఘునాధపురం గ్రామానికి వెళ్లే రెండు దారుల్లోనూ నడుముల్లోతు నీళ్లు చేరాయి. దీంతో ఈ మార్గంలో ట్రాక్టర్‌ మినహా ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రెండు రోజులుగా మంచినీళ్లు లేక రఘునాథపురం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తిరువెంగలాపురం శివారుల్లో ఉన్న ఆనకట్ట పై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. బయనపల్లె చెరువుకు సోమవారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని దుండగలు గండికొట్టారని బయనపల్లె గ్రామస్తులు ఆరోపించారు. చెరువుకు గండిపడడంతో 100 ఎకరాల పైబడి పంట నీటమునిగిందన్నారు.

Advertisement
Advertisement