Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏఏజీ సుధాకర్‌రెడ్డిపై ఏపీ బార్ కౌన్సిల్‌కి రఘురామ ఫిర్యాదు

అమరావతి: రాష్ట్ర ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై ఏపీ బార్ కౌన్సిల్‌కి ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నుంచి జీతంతో పాటు అన్ని వసతులు పొందుతూ టీవీ 9, సాక్షి ఛానళ్లలో తనపై నోటికి వచ్చినట్లు మాట్లాడారని రఘురామ ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన ఏఏజీ పదవిలో ఉండి తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని రఘురామ ఫిర్యాదు చేశారు. సుధాకర్‌రెడ్డి న్యాయవాద వృత్తికి అనర్హుడు రఘురామ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సుధాకర్‌రెడ్డిపై వెంటనే చర్యలు చేపట్టాలని బార్ కౌన్సిల్‌‌ను రఘురామకృష్ణరాజు కోరారు.  

Advertisement
Advertisement