అందుకే నన్ను కొట్టారు: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2022-01-27T21:03:42+05:30 IST

సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం చదువుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు సూచించారు.

అందుకే నన్ను కొట్టారు: ఎంపీ రఘురామ

న్యూఢిల్లీ: సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం చదువుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు సూచించారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని గౌరవిస్తే 2వందల కేసులను ఓడిపోయేవాళ్లం కాదన్నారు. రాజ్యాంగం ఫాలో కావాలన్నందుకే తనను కొట్టారన్నారు. ఒక ఎంపీ తన నియోజకవర్గంలో తిరిగే హక్కు కూడా ఏపీలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో జీవోలు అమలు చేసి.. జిల్లాల విభజన చేపడుతున్నారని, పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటని అంటున్నారని, అర్ధరాత్రి జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. కేబినెట్‌లో జిల్లాలపై చర్చ జరగకుండానే.. అర్ధాంతరంగా తీసుకురావాల్సిన అవసరమేంటని నిలదీశారు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టకుండా జిల్లాల విభజన చేయాలని రఘురామ సూచించారు.


టీడీపీ నేత అశోక్‌బాబుపై అక్రమ కేసులు పెట్టారని ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు. అశోక్‌బాబు చదివిన చదువు ఉద్యోగానికి సరిపోతుందని అన్నారు. ఐదో తరగతి చదువుకున్న వారికి మంత్రి పదవి ఇచ్చారని... సలహాదారులను కూడా నియమించారని ఎంపీ రఘురామ ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-01-27T21:03:42+05:30 IST