కోర్టుతో రాయలసీమకు వచ్చేదేమీ లేదు: రఘురామ

ABN , First Publish Date - 2021-12-20T21:18:51+05:30 IST

వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి పారిశ్రామికవేత్తలు వస్తే కూడా సీఎం జగన్మోహన్‌‌రెడ్డిని కలవలేని పరిస్థితి, పరిశ్రమలు పెట్టాలంటే మనం ఏం అడుగుతామో అనే భయం పారిశ్రామికవేత్తలకు ఉందన్నారు.

కోర్టుతో రాయలసీమకు వచ్చేదేమీ లేదు: రఘురామ

అమరావతి:  వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి పారిశ్రామికవేత్తలు వస్తే కూడా  సీఎం జగన్మోహన్‌‌రెడ్డిని కలవలేని పరిస్థితి, పరిశ్రమలు పెట్టాలంటే మనం ఏం అడుగుతామో అనే భయం పారిశ్రామికవేత్తలకు ఉందన్నారు. రాయలసీమకు న్యాయం చేయాలనిపిస్తే న్యాయ వ్యవస్థ పెట్టడంతో కాదు.రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్నారు. కోర్టుతో రాయలసీమకు వచ్చేదేమీ లేదన్నారు.కేవలం ఓట్ల కోసం మనం డబ్బులిస్తే సరిపోతుందని అనుకోవద్ధు.. ప్రజలు తీసుకున్న ఒక్కరోజు మాత్రమే సంతోష పడుతారని చెప్పారు. తణుకులో సీఎం వెళ్లే దారిలో అన్ని షాపులు మూసి వేయాలని అంటున్నారని ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన మనం ఇలా చేయడం మంచిది కాదన్నారు. జగనన్న మద్యం దీవెన"కొత్త స్కీమ్’’ తో వచ్చారని చెప్పారు.  లిక్కర్ రేట్లు షాక్ కొట్టేవిధంగా ఉంటాయని గతంలో జగన్మోహన్‌రెడ్డి చెప్పారన్నారు.మద్యం రేట్లు ఎక్కువగా ఉన్నందున నాటు సారా,గంజాయి తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో తయారు అవుతున్న మద్యంపై గతంలో కేంద్రానికి లేఖ రాశామని గుర్తుచేశారు.రాష్ట్రంలో ఈరోజు మెడికల్, కెమికల్ అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. రెండు మూడు కంపెనీలు తయారు చేస్తున్న మద్యాన్ని ఎందుకు కొంటున్నారని, ఈ విషయం ముఖ్యమంత్రికి తెలిసి ఉండకపోవచ్చని అన్నారు. మంచి చేస్తే ఉద్యోగులు వారిని ఓడిస్తారని జగన్‌కి తెలుసునన్నారు. జెన్కో ఉద్యోగులు కూడా 150 మంది రాజీనామా చేశారని, నిధులు వస్తాయోలేదోనని వారు ముందే రాజీనామా చేశారని రఘురామ పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-20T21:18:51+05:30 IST