నాపై అనర్హత వేటు సాధ్యం కాదు

ABN , First Publish Date - 2021-06-13T08:42:44+05:30 IST

‘‘నా సభ్యత్వంపై అనర్హత వేటు సాధ్యం కాదు. నేను ఎవరితోనూ, ఏ పార్టీతోనూ జత కట్టలేదు. నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నా. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ సీఎం

నాపై అనర్హత వేటు సాధ్యం కాదు

హామీలు నెరవేర్చాలన్నందుకే చర్య తీసుకుంటారా!: రఘురామరాజు


అమరావతి, న్యూఢిల్లీ, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): ‘‘నా సభ్యత్వంపై అనర్హత వేటు సాధ్యం కాదు. నేను ఎవరితోనూ, ఏ పార్టీతోనూ జత కట్టలేదు. నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నా. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ సీఎం జగన్‌ని కోరుతున్నా. అలా కోరినంతనే నాపై అనర్హత వేటు వేస్తారా?’’ అని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ మార్గాని భరత్‌ ఇచ్చిన ఫిర్యాదుపై శనివారం ఆయన వాట్సప్‌ వేదికగా స్పందించారు. ‘‘కొంతమంది తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశా. వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి. నాపై ఈ నెల 10న ఫిర్యాదు చేశారు. 11న చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రిని, సీఎం కలిశాకే ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. నాపై వేటు వేయలని స్పీకర్‌కు లేఖ అందించడం ఇది నాలుగో సారో ఐదో సారో. నాపై దాడి గురించి మరోసారి ప్రివిలేజ్‌ మోషన్‌ను స్పీకర్‌కు ఇస్తా’’ అని రఘురామ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-06-13T08:42:44+05:30 IST