Abn logo
Sep 24 2021 @ 23:44PM

క్రికెట్‌ బ్యాట్‌ పట్టిన రఘువీరా!

బ్యాటింగ్‌ చేస్తున్న రఘువీరారెడ్డి

మడకశిర రూరల్‌, సెప్టెంబరు 24: రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రశాంత జీవనం గడుపుతున్న మాజీ మంత్రి రఘువీరా రెడ్డి కాసేపు క్రికెట్‌ బాట్‌చేతపట్టి బ్యాటింగ్‌ చేశారు.  శుక్రవారం నీలకంఠాపురం గ్రామంలో శ్రీరామిరెడ్డి 115వ జయంతి సందర్భంగా ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. అనంతరం యువకులతో కలసి కాసేపు సరదాగా క్రికెట్‌ ఆడారు. సీఐ బోలింగ్‌ చేయగా రఘువీరా బ్యాటింగ్‌ చేశారు. అనంతరం రఘువీరారెడ్డి సీఐను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.