ఆర్‌బీకేల్లో రాగులు కొనుగోలు

ABN , First Publish Date - 2020-12-04T05:44:36+05:30 IST

గిరి రైతులు పండించిన రాగులకు ప్రభుత్వం కిలో రూ.33 మద్దతు ధర ప్రకటించిందని మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ అరుణ తెలిపారు.

ఆర్‌బీకేల్లో రాగులు కొనుగోలు
సమావేశంలో మాట్లాడుతున్న మార్క్‌ఫెడ్‌ డీఏం అరుణ

కిలో రాగులు ధర రూ.33. మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ అరుణ

అరకులోయ, డిసెంబరు 3: గిరి రైతులు పండించిన రాగులకు ప్రభుత్వం కిలో రూ.33 మద్దతు ధర ప్రకటించిందని మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ అరుణ తెలిపారు. గురువారం స్థానిక రైతు భరోసా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. లాభదాయకమైన ధర లభించినందున గిరి రైతులు రైతు భరోసా కేంద్రాలకు రాగులను తెచ్చి విక్రయించే విధంగా సచివాలయ, వెలుగు, వ్యవసాయ సిబ్బంది ప్రచారం చేయాలన్నారు. వారం రోజుల్లో వారి నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయన్నారు. జిల్లాలో ఈ ఏడాది 2,991 మంది రైతులు 31 వేల ఎకరాల్లో రాగులు సాగు చేశారన్నారు. ప్రైవేటు వర్తకులు కిలో రూ.15 నుంచి రూ.18లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, మార్క్‌ఫెడ్‌ కిలోరూ.33 చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అరకు మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శి జగన్‌, వెలుగు ఏపీఏం అప్పాయమ్మ, సచివాలయ, వ్యవసాయ సహాయకులు, వెలుగు సీసీలు, వీఓఏలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:44:36+05:30 IST