షూటింగ్‌బాల్‌లో జాతీయ జట్టుకు రెహమాన్‌

ABN , First Publish Date - 2022-01-20T04:47:48+05:30 IST

జాతీయ షూటింగ్‌బాల్‌ జట్టుకు చింతకొమ్మదిన్నె మండలం రాజులతాతయ్యగారిపల్లెకు చెందిన ఎస్‌.రెహమాన్‌ ఎంపికైనట్లు జిల్లా షూటింగ్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నిత్యపూజయ్య తెలిపారు.

షూటింగ్‌బాల్‌లో జాతీయ జట్టుకు రెహమాన్‌
రెహమాన్‌ను అభినందిస్తున్న స్టెప్‌ సీఈవో

కడప (మారుతీనగర్‌), జనవరి 19 : జాతీయ షూటింగ్‌బాల్‌ జట్టుకు చింతకొమ్మదిన్నె మండలం రాజులతాతయ్యగారిపల్లెకు చెందిన ఎస్‌.రెహమాన్‌ ఎంపికైనట్లు జిల్లా షూటింగ్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నిత్యపూజయ్య తెలిపారు. గత సంవత్సరం సెప్టెంబరు నెలలో గుం టూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో రెహమాన్‌ మంచి ప్రతిభ కనబరచడంతో పాటు గుజరాత్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీలలో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించడంతో ప్రస్తుతం జాతీయ జట్టులో స్థానం సంపాదించాడన్నారు. కాగా జాతీయ జట్టుకు ఎంపికైన రెహమాన్‌ను బుధవారం స్టెప్‌ సీఈవో ఎం.రామచంద్రారెడ్టి తన కార్యాలయంలో అభినందించారు. కార్యక్రమంలో బ్లడ్‌ 2 లీవ్‌ వ్యవస్థాపకులు పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T04:47:48+05:30 IST