యూపీ యువత కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో

ABN , First Publish Date - 2022-01-21T20:51:01+05:30 IST

యువతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ''ఉత్తరప్రదేశ్‌ యూత్ మేనిఫెస్టో''ను కాంగ్రెస్ పార్టీ బుధవారంనాడు..

యూపీ యువత కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో

న్యూఢిల్లీ: యువతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ''ఉత్తరప్రదేశ్‌ యూత్ మేనిఫెస్టో''ను కాంగ్రెస్ పార్టీ బుధవారంనాడు విడుదల చేసింది. ఢిల్లీలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సంయుక్తంగా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధా మీడియాతో మాట్లాడుతూ, యువత అభిప్రాయాలకు తమ మేనిఫెస్టో అద్దంపడుతోందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ యువతను సంప్రదించి, వారి అభిప్రాయాలకు అనుగుణంగా యూత్ మేనిఫెస్టోను కాంగ్రెస్ రూపొందించిందని చెప్పారు. యూపీకి ఒక కొత్త విజన్ అవసరమని, ఆ విజన్‌ను సాకారం చేయడం చిన్న పార్టీల వల్ల కాదని, కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పారు. "మేము విద్వేష వ్యాప్తి చేయం. ప్రజలను కలిపి ఉంచుతాం. యువతలోని సామర్థ్యాన్ని ఉపయోగించుకుని నవీన ఉత్తరప్రదేశ్‌ను నిర్మిస్తాం'' అని రాహుల్ హామీ ఇచ్చారు.


అతి పెద్ద సమస్య అదే: ప్రియాంక

ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ జరక్కపోవడమే యూపీలో అతి పెద్ద సమస్య అని, యువత ఎంతో నిరుత్సాహంతో ఉన్నారని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే విజన్‌తో కాంగ్రెస్ పనిచేస్తుందని చెప్పారు. వివిధ పోస్టుల్లో ఖాళీలను తాము భర్తీ చేస్తామని, రిక్రూట్‌మెంట్ ప్రోసెస్‌పై జాబ్ క్యాలెండర్ తీసుకు వస్తామని వివరించారు.

Updated Date - 2022-01-21T20:51:01+05:30 IST