పొంగల్ స్పెషల్... మోహన్ భాగవత్, నడ్డా, రాహుల్.. ముగ్గురూ చెన్నైలోనే

ABN , First Publish Date - 2021-01-14T17:13:35+05:30 IST

చెన్నై.... పొంగల్ పండగకు ప్రసిద్ధి. పొంగల్ పండగను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈసారి మాత్రం జాతీయ నాయకులు

పొంగల్ స్పెషల్... మోహన్ భాగవత్, నడ్డా, రాహుల్.. ముగ్గురూ చెన్నైలోనే

న్యూఢిల్లీ : చెన్నై.... పొంగల్ పండగకు ప్రసిద్ధి. పొంగల్ పండగను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈసారి మాత్రం జాతీయ నాయకులు కూడా పొంగల్ ఉత్సవాన్ని చెన్నైలో జరుపుకుంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ రావ్ భాగవత్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా... ఈ ముగ్గురూ చెన్నైలోనే వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. పొంగల్ పూట ముగ్గురు ప్రముఖులూ ఒకే రాష్ట్రంలో వివిధ వేడుకల్లో పాల్గొనడం విశేషం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ గురువారం కదంబుడీ చిన్నమ్మన్ ఆలయంలో గోపూజలో పాల్గొన్నారు. గోపూజలో పాల్గొని, పొంగల్ ఉత్సవాలను ప్రారంభించారు. మోహన్ భాగవత్ చెన్నై పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ రెండు రోజుల్లో చెన్నై ప్రముఖులు, యువ పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. ఇక.... బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా పొంగల్ వేడుకల్లో పాల్గొననున్నారు. పొంగల్ వేడుకల్లో పాల్గొన్న తర్వాత బీజేపీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇక కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా పొంగల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జల్లికట్టు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నిర్వహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ పోటీలను చూసేందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మధురై జిల్లాకు రానున్నారు. 

Updated Date - 2021-01-14T17:13:35+05:30 IST