Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 8 2021 @ 02:00AM

రాజీవ్‌ హంతకుల విడుదలపై నిర్ణయం తీసుకోండి

 తమిళనాడు గవర్నర్‌ను కోరిన సుప్రీంకోర్టు

చెన్నై, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో ఏడుగురు ముద్దాయిల విడుదలపై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్‌ జాప్యం చేయడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 1991 మే 21న శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న రాజీవ్‌గాంధీ మానవబాంబు దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన పేరరివాలన్‌, నళిని, రవిచంద్రన్‌, మురుగన్‌, జయకుమార్‌, రాబర్ట్‌ ఫయాజ్‌, శాంతన్‌ అనే ఏడుగురు గత 30 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో పేరరివాలన్‌ను విడుదల చేయాలని పలు రాజకీయ పార్టీల నేతలు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను కోరుతున్నాయి. 2018లో రాజీవ్‌ హంతకులను విడుదల చేయాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. దీనిపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో పేరరివాలన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

Advertisement
Advertisement