Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 19 2021 @ 19:57PM

పంజాబ్ కొత్త కెప్టెన్‌కు రాహుల్ గ్రీటింగ్స్

న్యూఢిల్లీ: పంజాబ్ సీఎల్‌పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికై, ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా సోమవారంనాడు ప్రమాణస్వీకారం చేయనున్న చరణ్‌జిత్ సింగ్‌ చన్నీకి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. పంజాబ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ముందుకు సాగాలని, ప్రజావిశ్వాసం అనేది అన్నిటికన్నా ముఖ్యమని ఓ ట్వీట్‌లో రాహుల్ పేర్కొన్నారు. కాగా, పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణం చేయనున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement