Good news for cricket fans: టీమిండియా హెడ్ కోచ్‎గా రాహుల్ ద్రవిడ్!

ABN , First Publish Date - 2021-10-16T17:16:05+05:30 IST

భారత క్రికెట్ అభిమానులకు పెద్ద శుభవార్త వచ్చింది. వచ్చే టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా జట్టుకు హెడ్‎కోచ్‎గా ఉండేందుకు రాహుల్ ద్రవిడ్ అంగీకరించాడని సమాచారం. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‎గా ఎంతో మంది యువ...

Good news for cricket fans: టీమిండియా హెడ్ కోచ్‎గా రాహుల్ ద్రవిడ్!

ఇంటర్నెట్‎ డెస్క్: భారత క్రికెట్ అభిమానులకు పెద్ద శుభవార్త వచ్చింది. వచ్చే టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా జట్టుకు హెడ్‎కోచ్‎గా ఉండేందుకు రాహుల్ ద్రవిడ్ అంగీకరించాడని సమాచారం. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‎గా ఎంతో మంది యువ ఆటగాళ్లను రాహుల్ ద్రవిడ్ తీర్చిదిద్దాడు. అయితే, ఇక నుంచి భారత్ జట్టుకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం. గతరాత్రి చెన్నై-కోల్‎కతా మధ్య ఐపీఎల్ సీజన్ -14 ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే..ఈ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ, సెక్రటరీ జైషా..ద్రవిడ్‎తో భేటీ అయినట్లు సమాచారం. గంగూలీ, జైషా కలిసి రాహుల్‎ను 2023 వరకు టీమిండియా హెడ్ కోచ్‎గా ఒప్పించరానే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి నేషనల్ మీడియాకు వెల్లడించాడు.


కాగా, ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్..ఎన్‎సీఏ హెడ్‎గా కొనసాగుతున్నాడు. అతి త్వరలోనే తన బాధ్యతల నుంచి తప్పుకుంటాడని, తర్వాత భారత జట్టు హెడ్ కోచ్‎గా పగ్గాలు అందుకుంటాడని ఓ నేషనల్ మీడియా ప్రచురించింది. కాగా, ఇప్పటికే ద్రవిడ్ అండర్ -19 స్థాయిలో చాలా మంది యువ ఆటగాళ్లను తీర్చిదిద్దాడు. తన పర్యవేక్షణలో మేటి ఆటగాళ్లుగా ఉన్న వారు..ప్రస్తుతం టీమిండియా జట్టులోనూ మెరుస్తున్నారు.


అయితే.., ఈ నెల 17 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్‎కప్ టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా హెడ్‎కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్‎గా అనిల్ కుంబ్లేతో పాటు పలువురు విదేశీ మాజీ ఆటగాళ్ల పేర్లు కూడా బాగానే వినిపించాయి. అయినా..బీసీసీఐ మాత్రం రాహుల్ ద్రవిడ్ వైపే ఎక్కువ ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్థానాన్ని ద్రవిడ్ భర్తీ చేయనున్నట్లు సమాచారం.

Updated Date - 2021-10-16T17:16:05+05:30 IST